Telugu Comedy OTT: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ కామెడీ డ్రామా మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Telugu Comedy OTT: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కమిటీ కుర్రాళ్లు మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కమిటీ కుర్రాళ్లు మూవీతో 11 మంది హీరోలు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
Telugu Comedy OTT: ఆగస్ట్ నెలలో టాలీవుడ్‌లో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయాల్ని అందుకున్నాయి. అందులో కమిటీ కుర్రాళ్లు మూవీ ఒకటి. కొత్త హీరోహీరోయిన్లు, దర్శకుడితో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన కమిటీ కుర్రాళ్లు నిర్మాతలకు నాలుగింతల లాభాల్ని తెచ్చిపెట్టింది.
ఈటీవీ విన్ ఓటీటీలో...
థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కమిటీ కుర్రాళ్లు మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ కామెడీ డ్రామా మూవీ ఈటీవీ విన్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను గురువారం ఈటీవీ విన్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. సెప్టెంబర్ 12న కమిటీ కుర్రాళ్లు మూవీ ఓటీటీలో రిలీజ్ కానునున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను ఈటీవీ విన్ అభిమానులతో పంచుకున్నది.
నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్...
కమిటీ కుర్రాళ్లు మూవీకి మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఈ రూరల్ కామెడీ డ్రామా మూవీతో యదు వంశీ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో దాదాపు పదకొండు మంది హీరోలను నిహారిక టాలీవుడ్‌కు పరిచయం చేసింది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్‌వర్మ, ఈశ్వర్‌తో పాటు మిగిలిన హీరోలు తమ నటనతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు. గోపరాజు రమణ, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.
అచ్చమైన గోదావరి యాసతో...
అచ్చమైన గోదావరి యాస, భాషలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు యదు వంశీ కమిటీ కుర్రాళ్లు మూవీని తెరకెక్కించాడు.ఇందులో అంతర్లీనంగా పల్లెటూళ్లలో ఉండే కులవివక్షను టచ్ చేశాడు. గోదావరి జిల్లాల్లోని ఓ పల్లెటూరులో ప్రతి పన్నెండేళ్లకు ఓ సారి జాతరజరుగుతుంటుంది. గతసారి జాతరలో బలిచాటకు ఎదురువెళ్లిన ఆత్రం అనే యువకుడు కన్నుమూస్తాడు.
దాంతో ఈ సారి జాతరలో బలిచాటను ఎత్తుకోవడానికి ఎవరూ ముందుకు రారు.ఆత్రం మరణంతో పాటు కులాలు, రిజర్వేషన్ల గురించి వచ్చిన గొడవల కారణంగా శివ (సందీప్ సరోజ్), సుబ్బుతో (త్రినాథ్ వర్మ), విలియం (ఈశ్వర్)తో పాటు చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ప్రాణ మిత్రుల మధ్య దూరం పెరిగిపోతుంది.
మరోవైపు కులాల గొడవలను అడ్డుపెట్టుకుంటూ సర్పంచ్ పొలిశెట్టి బుజ్జి (సాయికుమార్) ఊరివాళ్లను కలవకుండా కుట్రలు పన్నుతుంటాడు. సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జికి వ్యతిరేకంగా చనిపోయిన తన తండ్రి స్థానంలో శివ పోటీలో నిలబడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
బుజ్జి చేతిలో ఎన్నికల్లో ఓడిపోయిన శివ ఊరి బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?గొడవల కారణంగా విడిపోయిన కమిటీ కుర్రాళ్లు జాతర కారణంగా తిరిగి ఎలా ఒక్కటయ్యారు? బలిచాటను ఎత్తుకునే విషయంలో శివ, అతడి స్నేహితులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అన్నదే ఈ మూవీ కథ.
మూడు కోట్ల బడ్జెట్…
దాదాపు మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కమిటీ కుర్రాళ్లు మూవీ 21 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. నిహారికకు భారీగా లాభాల్ని తెచ్చిపెట్టింది. కమిటీ కుర్రాళ్లు మూవీకి దీపక్ దేవ్ మ్యూజిక్ అందించాడు. పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై నిహారిక ఈ సినిమాను నిర్మించింది.