ఓటీటీలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. పంచాయత్ మేకర్స్ నుంచే.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే-comedy web series gram chikitsalay ott release date trailer out to stream on amazon prime video on 9th may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. పంచాయత్ మేకర్స్ నుంచే.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

ఓటీటీలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. పంచాయత్ మేకర్స్ నుంచే.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి మరో కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ బుధవారం (ఏప్రిల్ 30) రిలీజైంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ మేకర్స్ నుంచే ఈ కొత్త సిరీస్ కూడా రానుంది. మరి ఈ సిరీస్ విశేషాలు తెలుసుకోండి.

ఓటీటీలోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. పంచాయత్ మేకర్స్ నుంచే.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులోనూ సివరపల్లి పేరుతో రీమేక్ అయింది. ఈ సిరీస్ మేకర్స్ నుంచి ఇప్పుడు మరో కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ ను బుధవారం (ఏప్రిల్ 30) మేకర్స్ రిలీజ్ చేశారు.

గ్రామ్ చికిత్సాలయ్ వెబ్ సిరీస్ ట్రైలర్

ప్రైమ్ వీడియో ఓటీటీలోకే గ్రామ్ చికిత్సాలయ్ (Gram Chikitsalay) పేరుతో సరికొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ మే 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు గతంలోనే ఆ ఓటీటీ వెల్లడించింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. రాహుల్ పాండే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించింది. బుధవారం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా సరదాగా సాగిపోయింది.

అమోల్ పరాశర్, వినయ్ పాఠక్, ఆనందేశ్వర్ ద్వివేదీ, ఆకాశ్ మఖీజా, గరిమా విక్రాంత్ సింగ్, ఆకాంక్ష రాజన్ కపూర్ లాంటి వాళ్లు నటించారు. సిటీని వదిలి ఓ ఊళ్లోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి వెళ్లే డాక్టర్ ప్రభాత్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అయితే అక్కడి వాళ్లు ఆ ప్రభుత్వ డాక్టర్ ను నమ్మరు. స్థానికంగా ఉండే ఓ నకిలీ డాక్టర్ దగ్గరికి క్యూ కడతారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తుల నమ్మకాన్ని సంపాదించి, వాళ్లకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నంలో డాక్టర్ ప్రభాత్ ఎదుర్కొనే సవాళ్లను సరదాగా ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు.

గ్రామ్ చికిత్సాలయ్ గురించి..

ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో ఉన్న ఈ తీవ్రమైన అంశం గురించి గ్రామ్ చికిత్సాలయ్ వెబ్ సిరీస్ సరదాగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో డాక్టర్ ప్రభాత్ పాత్ర పోషించడంపై అమోల్ పరాశర్ స్పందించాడు. ఈ పాత్రను ప్రేక్షకులు చూసి ఆస్వాదించాలని అతడు ఆకాంక్షించాడు.

ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా.. వాళ్లకు సేవ చేయాలన్న ఓ డాక్టర్ తపనను ఈ సిరీస్ కళ్లకు కట్టనుంది. పంచాయత్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ అందించిన టీవీఎఫ్ నుంచి వస్తున్న సిరీస్ కావడంతో సహజంగానే ఈ గ్రామ్ చికిత్సాలయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం