మలయాళం మూవీ పప్పచన్ ఒలివిలాను తెలుగులోకి వచ్చింది. భాస్కర్ దాక్కొనివున్నాడు పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ నేరుగా సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
భాస్కర్ దాక్కొనివున్నాడు మూవీలో సైజుకురుప్ హీరోగా నటించాడు. శ్రిందా, అజు వర్గీస్, విజయరాఘవన్, జగదీష్ కీలక పాత్రలు పోషించారు. సింటో సన్నీ దర్శకత్వం వహించాడు. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కామెడీ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం పప్పచన్ ఒలివిలాను పరాజయాన్ని మూటగట్టుకుంది.
మత్తచన్ గొప్ప వేటగాడి పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు. వేట విషయంలో అతడి ధైర్యసాహసాలను ఊరివాళ్లు కథలుగా చెప్పుకుంటుంటారు. తండ్రి మత్తచన్ మాదిరిగానే తాను ఓ ఫేమస్ వేటగాడి మారాలని అతడి పప్పచన్ కలలు కంటాడు. కానీ చివరకు వ్యాన్ డ్రైవర్‌గా సెటిల్ అవుతాడు. ఓ సారి తన ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు అడివి జంతువును వేటాడి అతిథులుకు ఆ మాంసం వడ్డిస్తాడు.
ఆ విషయం తెలిసిన పోలీసులు, అటవీ అధికారులు పప్పచన్‌ను అరెస్ట్ చేయడానికి వస్తారు. పప్పచన్ తప్పించుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ జేమ్స్...పప్పచన్‌పై రివేంజ్ కోసం ఎదురుచూస్తుంటాడు. అడవి జంతువులను వేటాడిన కేసులో అతడిని ఎలాగైనా జైలుకు పంపించాలని అనుకుంటాడు. తన స్నేహితుడైన బెన్నీ ఇంట్లో పప్పచన్ దాక్కుంటాడు.
బెన్నీ భార్య సిసిలీ అతడిని ఎలా కాపాడింది? సిసిలీకి పప్పచన్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి? క్లాస్‌మేట్స్ అయిన జేమ్స్ పప్పచన్ ఎందుకు పగను పెంచుకున్నాడు? ఈ కేసు నుంచి పప్పచన్ బయటపడ్డాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ఈ మూవీలో సైజు కురుప్ కామెడీ టైమింగ్, పంచ్‌లు బాగా వర్కవుట్ అయ్యాయి. కానీ కథ సాగదీయడం, మిగిలిన క్యారెక్టర్స్ లోని కామెడీ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
భాస్కర్ దాక్కొనివున్నాడుతో పాటు సైనా ప్లే ఓటీటీలో చతురం, బూమ్‌రాంగ్, జాక్సన్ బజార్ గ్యాంగ్‌తో పాటు మరికొన్ని మలయాళం సినిమాలు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
సంబంధిత కథనం