OTT Comedy: ఓటీటీలోకి నయా కామెడీ చిత్రం.. రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇంట్లో పని మనిషిగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-comedy romantic movie mr housekeeping will be streaming aha tamil ott from march 25 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy: ఓటీటీలోకి నయా కామెడీ చిత్రం.. రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇంట్లో పని మనిషిగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Comedy: ఓటీటీలోకి నయా కామెడీ చిత్రం.. రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇంట్లో పని మనిషిగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Comedy movie: మిస్టర్ హౌస్‍కీపింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్‍తో రూపొందిన ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..

OTT Comedy: ఓటీటీలోకి నయా కామెడీ చిత్రం..  రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇంట్లో పని మనిషిగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

హరి భాస్కర్, లోసిల్య మరియనేసన్ ప్రధాన పాత్రల్లో మిస్టర్ హౌస్‍‍కీపింగ్ సినిమా వచ్చింది. ఈ ఏడాది జనవరి 24న ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదలైంది. ఈ లోబడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే పర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాకు అరుణ్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మిస్టర్ హౌస్‍‍కీపింగ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు..

మిస్టర్ హౌస్‍‍కీపింగ్ సినిమా రేపు (మార్చి 25) 'ఆహా తమిళ్' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. టెంట్‍కొట్ట ఓటీటీలోనూ మార్చి 25నే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

మిస్టర్ హౌస్‍‍కీపింగ్ చిత్రంలో హరి భాస్కర్, లోసిల్యతో పాటు ఇళవరసు, రాయన్, జవహర్ శక్తి, షా రా, ఎంజే శ్రీరామ్, ఉమా రామచంద్రన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించారు డైరెక్టర్ అరుణ్. ఈ చిత్రానికి ఓషో వెంకట్ సంగీతం అందించారు.

మిస్టర్ హౌస్‍‍కీపింగ్ స్టోరీలైన్

డబ్బు అవసరాలు తీవ్రంగా ఉండటంతో పనిమనిషిగా చేయాలని హానెస్ట్ రాజు (హరి భాస్కర్) డిసైడ్ అవుతాడు. ఇసాయ్ (లోహిస్య) ఓ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంటుంది. అయితే, కాలేజీలో రాజు లవ్ ప్రపోజల్‍ను ఇసాయ్ రిజెక్ట్ చేస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఇసాయ్ వద్దే పనిమనిషిగా చేరతాడు హానెస్ట్ రాజు. ఈ క్రమంలోనే హరిశ్ (రాయన్)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే, పనిమనిషిగా చేరిన తర్వాత రాజుతో ఇసాయ్ పరిచయం పెరుగుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇసాయ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అనేదే మిస్టర్ హౌస్‍‍కీపింగ్ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

మిస్టర్ హౌస్‍‍కీపింగ్ చిత్రాన్ని శ్రీ తెనండల్ ఫిల్మ్స్, ఇన్‍వేట్ మీడియా బ్యానర్లపై ఎన్.రామసామి, నితిన్ మనోహర్ నిర్మించారు. ఈ సినిమాలో స్టోరీపాయింట్ ఆకట్టుకున్నా.. కథనం కాస్త ఊహించినట్టుగా సాగుతుంది. కామెడీ మెప్పిస్తుంది.

గత వారం రింగ్ రింగ్ చిత్రం ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో ప్రవీణ్ రాజ్, వివేక్ ప్రసన్న, సాక్షి‍ అగర్వాల్, డానియెల్ అనీ పోప్, స్వయం సిద్ధ, జమున లీడ్ రోల్స్ చేశారు. ఈ కామెడీ చిత్రానికి శక్తివేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏడాది జనవరి 31న థియేటర్లలో విడుదలైంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం