OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?-comedy movie sharmajee ki beti to stream in amazon prime video from june 28th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jun 17, 2024 12:44 PM IST

OTT: ఓటీటీలోకి మరో కామెడీ మూవీ నేరుగా వచ్చేస్తోంది. తాజాగా ప్రైమ్ వీడియో కొత్త మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. తాహిరా కశ్యప్ తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT: మరో కామెడీ సినిమా ఓటీటీలోకి నేరుగా వస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్ పై ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో.. ఇప్పుడో మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామాను తీసుకొస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (జూన్ 17) తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది.

శర్మాజీ కీ బేటీ రిలీజ్ డేట్

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతున్న ఈ కామెడీ మూవీ పేరు శర్మాజీ కీ బేటీ. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య, నటి కూడా అయినా తాహిరా కశ్యప్ తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఐదేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడి పోరాడి ఆ మహమ్మారిని జయించిన తాహిరా.. ఇప్పుడీ శర్మాజీ కీ బేటీ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది.

గతంలోనే ఈ ఏడాది రాబోయే సినిమాల జాబితాలో ప్రైమ్ వీడియో ఈ సినిమా గురించి వెల్లడించింది. అయితే తాజాగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. జూన్ 28 నుంచి ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సాక్షి తన్వర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఈ సినిమాకు కథ అందించడంతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తాహిరానే చేపట్టింది.

శర్మాజీ కీ బేటీ గురించి..

ఈ శర్మాజీ బేటీ మూవీలో సాక్షి తన్వర్ తోపాటు దివ్యా దత్తా, సయామీ ఖేర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఓ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుత సమాజంలో మహిళల సాధికారత, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ప్రైమ్ వీడియో వెల్లడించింది. శర్మ అనే ఇంటిపేరు కలిగిన ముగ్గురు మధ్య వయసు మహిళలు, ఇద్దరు టీనేజ్ అమ్మాయిల అనుభవాలు, వాళ్ల కష్టాలను సరదాగా చూపించే ప్రయత్నం ఈ శర్మాజీ కీ బేటీ మూవీ ద్వారా చేశారు.

ఓ సినిమా తీయడం తాహిరాకు ఇదే తొలిసారి అయినా.. గతంలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఆమె సొంతం. నీనా గుప్తా నటించిన పిన్నీ, టోఫీలాంటి షార్ట్ ఫిల్మ్స్ కి ఆమె దర్శకత్వం వహించింది. ఇప్పుడీ శర్మాజీ కీ బేటీ మూవీ ట్రైలర్ ఇదే వారం రానుంది.

ప్రైమ్ వీడియో రిలీజెస్

ప్రైమ్ వీడియో ఓటీటీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ గురించి మూడు నెలల కిందటే అనౌన్స్ చేసింది. వీటిలో కొన్ని వెబ్ సిరీస్, మూవీస్ ఇప్పటికే రాగా.. మరికొన్ని రావాల్సి ఉంది. మీర్జాపూర్ 3, పాతాళ్ లోక్ 2లాంటి సీక్వెల్స్ గురించి కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీర్జాపూర్ 3 అయితే జులై 5న రాబోతోంది. ఇక సమంత, వరుణ్ ధావన్ నటించిన సిటడెల్ వెబ్ సిరీస్ కూడా రావాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

WhatsApp channel