Comedian Saptagiri: ప్రభాస్ అన్నకి థ్యాంక్యూ.. ఒరిజినల్ పెళ్లికాని ప్రసాదు వెంకటేష్.. కమెడియన్ సప్తగిరి కామెంట్స్
Comedian Saptagiri About Prabhas Venkatesh In Press Meet: కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ పెళ్లికాని ప్రసాద్. మార్చి 21న థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్, వెంకటేష్‌పై సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Comedian Saptagiri About Prabhas Venkatesh In Press Meet: టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ మూవీ 'పెళ్లికాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.
హీరోయిన్‌గా ప్రియాంక శర్మ
అయితే, ప్రియాంక శర్మ హీరోయిన్‌గా చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా మార్చి 21న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ పెళ్లికాని ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నా మనస్సాక్షిగా
హీరో సప్తగిరి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. పెళ్లికాని ప్రసాద్ సినిమా కోసం మాకు మేము ఒక ఎగ్జామ్ రాసుకున్నాం. నా మనస్సాక్షిగా 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమాకి ఆడియన్స్ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆశిస్తున్నాను. సినిమా చాలా బావొచ్చింది. మార్చి 21న మీరంతా సినిమా చూసి జెన్యూన్‌గా రివ్యూ ఇస్తారని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
సిన్సియారిటీ కనిపిస్తుంది
"హీరోయిన్‌గా నటించిన ప్రియాంక శర్మ గారికి థాంక్యూ. అన్నపూర్ణమ్మ గారు ప్రమోదిని గారు మిగతా నటులంతా ఈ సినిమాలో చేసే హడావిడి తప్పకుండా మీకు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ మురళి గౌడ్. ఈ క్యారెక్టర్‌లో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. ఈ సినిమా మంచి ఫన్ బ్లాస్ట్‌గా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడ కూడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు" అని సప్తగిరి తెలిపాడు.
గొప్పగా మాట్లాడే సినిమా తీశారు
"డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఆడియన్స్ అందరు కూడా గొప్పగా మాట్లాడే సినిమా తీశారు. మా సినిమా టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకి థాంక్యూ సో మచ్. మా ట్రైలర్‌ని విక్టరీ వెంకటేష్ గారు లాంచ్ చేశారు. ఒరిజినల్ పెళ్లికాని ప్రసాదు వెంకటేష్ గారు కాబట్టి ఆయన నన్ను ఆశీర్వదించి సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకున్నారు. ఆయనకి ధన్యవాదాలు" అని సప్తగిరి చెప్పుకొచ్చాడు.
మంచి కంటెంట్ ఉంటేనే
"ఎస్వీసీ లాంటి గొప్ప బ్యానర్‌లో ఈ సినిమా రిలీజ్ కావడం మా అదృష్టం. మంచి కంటెంట్ ఉంటేనే వాళ్లు రిలీజ్ చేస్తారు. దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థాంక్యూ వెరీ మచ్. వారి దగ్గరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ఎదిగాను. ఇంత లాంగ్ టైం తర్వాత వారి బ్యానర్‌లో సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది" అని సప్తగిరి పేర్కొన్నాడు.
మంచి పేరు తీసుకొచ్చే మూవీ
"నన్ను సపోర్ట్ చేసిన వారి బ్యానర్‌కి, మారుతి గారికి, అనిల్ అన్నకి, అందరికీ మంచి పేరు తీసుకొచ్చే సినిమా చేశాను. ఈ సినిమా వెంట నిలబడ్డ అందరికీ థాంక్యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ అందరిని మెప్పిస్తుందని నమ్ముతున్నాను" అని కమెడియన్, హీరో సప్తగిరి తన స్పీచ్ ముగించాడు.
సంబంధిత కథనం