Saptagiri: ఒక కమెడియన్‌ను నవ్వించడం అంత ఈజీ కాదు.. కానీ.. హీరో సప్తగిరి కామెంట్స్-comedian saptagiri comments on pelli kani prasad movie and director abhilash reddy gopidi heroine priyanka sharma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saptagiri: ఒక కమెడియన్‌ను నవ్వించడం అంత ఈజీ కాదు.. కానీ.. హీరో సప్తగిరి కామెంట్స్

Saptagiri: ఒక కమెడియన్‌ను నవ్వించడం అంత ఈజీ కాదు.. కానీ.. హీరో సప్తగిరి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Saptagiri About Pelli Kani Prasad Movie And Director: కమెడియన్‌గా, హీరోగా అలరిస్తున్న సప్తగిరి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

ఒక కమెడియన్‌ను నవ్వించడం అంత ఈజీ కాదు.. కానీ.. హీరో సప్తగిరి కామెంట్స్

Saptagiri About Pelli Kani Prasad Movie And Director: టాలీవుడ్‌లో కమెడియన్‌గా అలరించిన సప్తగిరి హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. సప్తగిరి హీరోగా చేస్తున్న మరో కొత్త సినిమా పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించింది.

పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు

థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించి పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

పెళ్లి కాని ప్రసాద్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

-సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్ర మకుట దర గోవిందా.. ఈ మూడు సినిమాలు కమర్షియల్ జోనర్‌లో మెప్పించే చిత్రాలు చేశాను. ప్రజలు 100% ఆదరించారు. ఫన్ జోనర్‌లో కామెడీకి మంచి స్కోప్ ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో పెళ్లి కాని ప్రసాద్ కథ వచ్చింది. స్క్రిప్ట్ విన్నాను చాలా నచ్చింది.

-డైరెక్టర్ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నవ్వించాడు. అప్పుడే సినిమా డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుందని నమ్మకం వచ్చింది. చిన్నచిన్న డౌట్స్ ఉంటే మారుతి గారి వద్దకి తీసుకువెళ్లి వినిపించాము. ఆయన విని చాలా బాగుందని చెప్పి ఫస్ట్ కాపీతో రమ్మని చెప్పారు.

-ఫస్ట్ కాపీ తీసుకెళ్లి మారుతి గారి ఇంట్లోనే హోమ్ థియేటర్‌లో చూశాం. ఆయన సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. సరైన దారిలో సినిమాని తీసుకెళ్లారని అభినందించారు. అలా మీ ముందుకు వస్తున్నాం.

టైటిల్ సెలక్షన్ ఎవరిది?

-డైరెక్టర్ గారిది. వెంకటేష్ గారి కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాదు. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆ టైటిల్ వెయిట్‌ని కాపాడేలా ఉంటుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది

డైరెక్టర్ అభిలాష్ గురించి?

-అభిలాష్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. తను స్క్రిప్ట్ చెప్పినప్పుడే 70% డైలాగ్ వెర్షన్‌తో చెప్పాడు. ఒక కమెడియన్‌ని నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ, అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆ హ్యూమర్ స్క్రీన్‌పైకి వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-హీరోని క్యారెక్టర్ ఇందులో చాలా డామినేటింగ్ ఉంటుంది. మా ఇద్దరి స్క్రీన్ స్పెషల్ ఈక్వల్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ సైడ్ నుంచి ఇందులో చాలా మంచి హ్యూమర్ జనరేట్ అవుతుంది.

ఈ సినిమాలో మెసేజ్ ఉంటుందా?

-లేదండి. ఇది కేవలం ప్రేక్షకులు నవ్వుకోవడానికి చేసిన సినిమా. సినిమాలో స్క్రీన్ ప్లే, సిచ్వేషనల్ కామెడీ చాలా అద్భుతంగా కుదిరింది. సినిమా ఫుల్‌ ఫన్ రైడ్‌లా ఉంటుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం