Student Misbehaved With Aparna Balamurali: ఆకాశ‌మే నీ హ‌ద్దురా హీరోయిన్‌కు చేదు అనుభ‌వం - సినిమా టీమ్‌పై నెటిజ‌న్లు ఫైర్-college student misbehaves with aparna balamurali in thankam movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  College Student Misbehaves With Aparna Balamurali In Thankam Movie Promotions

Student Misbehaved With Aparna Balamurali: ఆకాశ‌మే నీ హ‌ద్దురా హీరోయిన్‌కు చేదు అనుభ‌వం - సినిమా టీమ్‌పై నెటిజ‌న్లు ఫైర్

Nelki Naresh Kumar HT Telugu
Jan 19, 2023 10:10 AM IST

Student Misbehaved With Aparna balamurali: మ‌ల‌యాళ హీరోయిన్ అప‌ర్ణ బాల‌ముర‌ళికి తాంకం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో చేదు అనుభ‌వం ఎదురైంది. ఆమెతో స్టూడెంట్ అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అప‌ర్ణ బాల‌ముర‌ళి
అప‌ర్ణ బాల‌ముర‌ళి

Student Misbehaved With Aparna balamurali: ఆకాశ‌మే నీ హాద్దురా హీరోయిన్ అప‌ర్ణ బాల‌ముర‌ళికి చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌ల‌యాళ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఓ కాలేజీ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ విద్యార్థి ప్ర‌వ‌ర్త‌న‌తో అప‌ర్ణ‌ బాల ముర‌ళి షాక్‌కు గురైంది. ప్ర‌స్తుతం తాంకం పేరుతో మ‌ల‌యాలంలో ఓ సినిమా చేస్తోంది అప‌ర్ణ బాల‌ముర‌ళి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ కాలేజీని చిత్ర యూనిట్ సంద‌ర్శించింది.

ఈ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అప‌ర్ణ బాల‌ముర‌ళి భుజంపై చేయివేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. తొలుత అప‌ర్ణ బాల‌ముర‌ళికి ఫ్ల‌వ‌ర్‌తో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ త‌ర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌తో అప‌ర్ణ బాల‌ముర‌ళి ఇబ్బందిగా ఫీల‌య్యింది. ఆ స్టూడెంట్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది.

ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ స‌మ‌యంలో చిత్ర యూనిట్‌తో పాటు కాలేజీ యాజ‌మాన్యం ఉన్న ఆ స్టూడెంట్ చేస్తోన్న ప‌నిని అడ్డుకోక‌పోవ‌డంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోన్నారు. అప‌ర్ణ బాల‌ముర‌ళికి స‌పోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

అదే ఈవెంట్‌లో తాను చేసిన త‌ప్పుకు అప‌ర్ణ బాల‌ముర‌ళిని ఆ స్టూడెంట్ క్ష‌మాప‌ణ అడిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సూరారై పొట్రు సినిమాలో అస‌మాన న‌ట‌న‌తో నేష‌న‌ల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న‌ది అప‌ర్ణ బాల‌ముర‌ళి.

మ‌ల‌యాళంలో బిజీ హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న అప‌ర్ణ బాల‌ముర‌ళి ప్ర‌స్తుతం ఫ‌హాద్ ఫాజిల్‌తో హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ధూమంలో న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటుగా మ‌రో ఆరు సినిమాల్ని అంగీక‌రించింది అప‌ర్ణ బాల‌ముర‌ళి.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.