Chris Martin at Maha Kumbh: మహా కుంభమేళాలో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్.. వీడియో వైరల్-coldplay chris martin visits maha kumbh mela with girlfriend dakota johnson on monday 27th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chris Martin At Maha Kumbh: మహా కుంభమేళాలో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్.. వీడియో వైరల్

Chris Martin at Maha Kumbh: మహా కుంభమేళాలో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Jan 27, 2025 09:09 PM IST

Chris Martin at Maha Kumbh: కోల్డ్‌ప్లే బ్యాండ్ కు చెందిన క్రిస్ మార్టిన్ తన గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ తో కలిసి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహా కుంభమేళాలో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్.. వీడియో వైరల్
మహా కుంభమేళాలో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్.. వీడియో వైరల్

Chris Martin at Maha Kumbh: ఇండియాలో పలు కాన్సర్ట్‌ల కోసం వచ్చిన కోల్డ్‌ప్లే బ్యాండ్ కు చెందిన క్రిస్ మార్టిన్ సోమవారం (జనవరి 27) మహా కుంభమేళాకు వెళ్లాడు. అతనితోపాటు అతని గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ కూడా ఉంది. ఆదివారం (జనవరి 26) రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి కాన్సర్ట్ చేసిన క్రిస్ మార్టిన్.. మరుసటి రోజే ఈ మెగా మేళాకు వెళ్లడం విశేషం.

మహా కుంభమేళాలో క్రిస్ మార్టిన్

మహా కుంభమేళా 2025 ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న విషయం తెలుసు కదా. దీనికి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. వీళ్లలో మన దేశానికి వచ్చిన ఓ స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు. అతని పేరు క్రిస్ మార్టిన్.

కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన సభ్యుడైన అతడు కూడా తన గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ తో కలిసి సోమవారం ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. ఈ ఇద్దరూ కుంభమేళాలో ఉన్న వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతన్ని చూసి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కార్లోనే ఉన్న క్రిస్.. వాళ్లందరికీ హాయ్ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు.

జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇక్కడి గంగా, యమున, సరస్వతిల త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాల కోసం కోట్లాది మంది అభిమానులు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు.

ఇండియాలో క్రిస్ మార్టిన్

ఇండియాలో నాలుగు కాన్సర్ట్ ల కోసం తన బ్యాండ్ సభ్యులతో కలిసి క్రిస్ మార్టిన్ ఇండియాకు వచ్చాడు. ముంబైలో రెండు, అహ్మదాబాద్ లో రెండు కాన్సర్ట్ లు జరిగాయి. ఆదివారం (జనవరి 26) రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్డ్‌ప్లే చివరి కాన్సర్ట్ జరిగింది.

దీనికి ఏకంగా 1.34 లక్షల మంది ఆడియెన్స్ వచ్చారు. ఇండియాలో జరిగిన అతిపెద్ద కాన్సర్ట్ గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీనికంటే ముందు దిల్జిత్ దోసాంజ్, జస్టిన్ బీబర్ లాంటి వాళ్ల కాన్సర్ట్ లకు 50 వేల మంది వరకూ వచ్చారు.

కోల్డ్‌ప్లే కాన్సర్ట్స్ కోసం ఇండియాకు వచ్చిన క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్.. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. ముంబైలోని శ్రీ బాబుల్‌నాథ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఇక బాలీవుడ్ నటి సోనాలి బింద్రేతో కలిసి డకోటా జాన్సన్ ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక స్వామి ఆలయానికి వెళ్లింది.

Whats_app_banner

సంబంధిత కథనం