OTT Comedy Thriller: తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడాలంటే?
OTT Comedy Thriller: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తోంది ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది.
OTT Comedy Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ రానుంది. తెలుగులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పేరు కాఫీ విత్ ఎ కిల్లర్. ఇదొక కామెడీ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. ఎప్పుడో రెండేళ్ల కిందటే థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి ఇన్నాళ్లకు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీ, స్టోరీ, ఇతర విశేషాలేంటో తెలుసుకోండి.

కాఫీ విత్ ఎ కిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
కాఫీ విత్ ఎ కిల్లర్ (Coffee With a killer) మూవీ ఎప్పుడో 2022లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అదే ఏడాది సెప్టెంబర్ లో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ లాంచ్ చేశాడు. అయితే అసలు ఈ పేరుతో ఓ మూవీ ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మొత్తానికి ఇప్పుడీ సినిమాను వచ్చే శుక్రవారం (జనవరి 31) నుంచి ఆహా వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.
ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. "ఒక కాఫీ షాప్.. అంతులేని ట్విస్టులు. జాతకాల నుంచి క్రైమ్ సీన్ల వరకు.. కాఫీ విత్ ఎ కిల్లర్ తో మంచి థ్రిల్లింగ్ రైడ్ పొందండి. కాఫీ విత్ ఎ కిల్లర్ జనవరి 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది.
దీనికి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా షేర్ చేసింది. అందులో ఓ వ్యక్తి ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో గన్ను పట్టుకొని కనిపించడం చూడొచ్చు.
కాఫీ విత్ ఎ కిల్లర్ మూవీ స్టోరీ ఏంటంటే?
కాఫీ విత్ ఎ కిల్లర్ సినిమాను ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేశాడు. ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్, రఘు బాబులాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. సెవెన్ హిల్స్ సతీష్ సినిమాను నిర్మించాడు. ఆర్పీ పట్నాయకే మ్యూజిక్ కూడా అందించాడు.
ఇది ఓ కాఫీ షాపులో జరిగే స్టోరీ. అక్కడే అందరూ కమెడియన్ అనుకునే ఓ కిల్లర్, ఓ పోలీస్ ఆఫీసర్, ఓ సినిమా తీయాలని కలలు కనే ఓ బ్యాచ్, జాతకాల పిచ్చి ఉన్న కొందరు వ్యక్తులు, ఓ డేట్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన కపుల్.. ఇలా వీళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది. 1999లో వచ్చిన నీకోసం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన ఆర్పీ పట్నాయక్.. తర్వాత నటుడు, డైరెక్టర్ గానూ పలు సినిమాలకు పని చేశాడు.
ఆర్పీ డైరెక్షన్ లో గతంలో అందమైన మనసులో, బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, తులసీ దళం, మనలో ఒకడులాంటి మూవీస్ కూడా వచ్చాయి. ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ మాత్రం ఓ డిఫరెంట్ జానర్లో వచ్చిన సినిమా కావడం విశేషం. మరి ఈ శుక్రవారం (జనవరి 31) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం