Cobra First Review: క్లైమ్యాక్స్ అదిరిపోయింది.. కోబ్రా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Cobra First Review: కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ఈ మూవీ బుధవారం (ఆగస్ట్ 31) వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Cobra First Review: చియాన్ విక్రమ్ యాక్టింగ్ స్కిల్స్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఓ అపరిచితుడు.. ఓ ఐ.. ఓ మల్లన్న.. ఓ శివపుత్రుడు.. ఈ మూవీస్‌తో తెలుగులోనూ విక్రమ్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కోబ్రాగా మళ్లీ అతడు వస్తున్నాడు. ఈ సినిమా బుధవారం (ఆగస్ట్ 31) రిలీజ్ కాబోతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమేర్ సంధు కోబ్రా మూవీ రివ్యూ ఇచ్చాడు. అన్ని పెద్ద సినిమాలకు ఇచ్చినట్లే ట్విటర్ ద్వారా కోబ్రా రివ్యూ చెప్పాడు. అతని ప్రకారం.. ఈ సినిమాలో విక్రమ్ నటనకు మరో అవార్డు పక్కా అట. అంతేకాదు డైరెక్షన్, క్లైమ్యాక్స్ చాలా బాగున్నట్లు చెప్పాడు.
"ఓ యూనిక్ కాన్సెప్ట్. డైరెక్షన్, క్లైమ్యాక్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతం. విక్రమ్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా మొత్తం విక్రమ్ షోనే. ఇర్ఫాన్ పఠాన్‌ను స్క్రీన్‌పై చూడటం బాగుంది. మూవీ మొత్తం ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆసక్తిగా ఉంది. మల్టీప్లెక్స్ ఫ్యాన్స్‌కు నచ్చుతుంది" అంటూ కోబ్రా మూవీకి త్రీస్టార్ రేటింగ్ ఇచ్చాడు ఉమేర్ సంధు.
కోబ్రా మూవీలో విక్రమ్ తన నట విశ్వరూపం చూపినట్లు చెబుతున్నారు. ఇందులో అతడు 20 విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. ట్రైలర్‌తోనే సినిమాపై అతడు అంచనాలు భారీగా పెంచేశాడు. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోబ్రాలో విలన్ రోల్‌లో కనిపించనుండటం విశేషం.
ఈ సినిమాకు తమిళనాడులో ఓ రేంజ్‌లో బజ్ ఉంది. సినిమా చూడటానికంటూ ఓ కాలేజీలో కొందరు స్టూడెంట్స్ ఏకంగా హాలిడే ప్రకటించండంటూ ప్రిన్సిపల్‌కు లెటర్ రాయడం కూడా మనం చూశాం. రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపుతోంది. కోబ్రా తర్వాత పొన్నియిన్ సెల్వన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చియాన్ విక్రమ్.