విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు కలిసి నటిస్తోన్న సినిమా ఖుషి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూట్ కశ్మీర్‌లో ముగిసింది. అయితే ఈ షూట్ సమయంలో సమంత, విజయ్‌కు గాయాలయ్యాయనని, ఓ స్టంట్ సన్నివేశం కోసం చేసిన షూట్‌లో దెబ్బతగిలిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా నిజంగానే వారికి గాయాలయ్యాయనని ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ వార్తలపై స్పష్టత వచ్చింది. ఇలాంటి ఊహాగానాలను నమ్మవద్దని సినీ వర్గాలకు చిత్రబృందం క్లారిటీనిచ్చింది.,"ఖుషి మూవీ షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలయ్యాయని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీమ్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చింది. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మవద్దు" అని చిత్రబృందం ఫిల్మ్ వర్గాలకు స్పష్టత ఇచ్చింది.,శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత కలిసి రెండో సారి పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది.,ఈ సినిమాను డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. సమంత, విజయ్ కలిసి నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి విడుదల కానుంది.,