Citadel Honey Bunny: సెలెబ్రిటీల కోసం ముంబయిలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ షో ప్రివ్యూ.. ఇన్‌స్టాలో సెలెబ్రిటీలు రివ్యూస్
Citadel Honey Bunny reviews: సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కానుంది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్‌కి ముందు ముంబయిలో సెలెబ్రిటీలకి ప్రీమియర్ షో వేశారు.
వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కానుంది. సెలెబ్రిటీల కోసం ముంబయిలో బుధవారం షో ప్రివ్యూ వేయగా.. షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతి శెట్టి, సందీప్ కిషన్, నేహా ధూపియా, నిమ్రత్ కౌర్ తదితరులు వచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.
సెలబ్రిటీల రివ్యూ సిటాడెల్: హనీ బన్నీ
ఇటీవల చందు ఛాంపియన్, అమరన్ చిత్రాల్లో కనిపించిన నటుడు భువన్ అరోరా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ షోను 'ఆణిముత్యం' అని కితాబిచ్చాడు.
కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ దర్శన్ కుమార్ ఈ షో గ్రిప్పింగ్ గా ఉందని భావించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. మొదటి ఎపిసోడ్ ఇప్పుడే చూశాను. అద్భుతమైన యాక్షన్‌తో నిండిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని కొనియాడాడు. వరుణ్ ధావన్, సమంత తమ పాత్రల పరిధి మేరకు నటిస్తున్నారు అని రాసుకొచ్చాడు.
'అన్ని ఎపిసోడ్లు గురువారం వరకు నేను వేచి ఉండలేను' అని మనీష్ పాల్ పోస్ట్ చేశారు. ప్రీమియర్ షో నుంచి సమంతతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన నేహా ధూపియా.. 'నేను చూసింది ఒక ఎపిసోడ్ మాత్రమేనని అందులోని ప్రతి బిట్ అద్భుతంగా ఉందని కొనియాడింది.
నిమ్రత్ కౌర్ తన రివ్యూలో ఇలా రాసింది "బృందానికి అభినందనలు... ప్రతి క్షణాన్ని ప్రేమించాను. చమత్కారం, కల్ట్, క్రూరత్వంతో ఎపిసోడ్ ఉంది’’ అని రాసుకొచ్చింది.
ప్రీమియర్ షో అనంతరం వరుణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ "నేను, సమంత చాలా కష్టపడ్డాం. మీరు ఇప్పటివరకు చూసిన దానికంటే ఈ సిరీస్‌లో మమ్మల్ని కొత్తగా చూస్తారు. తొలిసారిగా రుస్సో బ్రదర్స్ ఇండియాలో ఓ షో వేశారు. నేను, సమంత మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో మీరు చూస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను మెప్పించిన రాజ్ అండ్ డీకే ఈ సిటాడెల్: హనీ బన్నీలో సిరీస్‌లో ఎలా మెప్పిస్తారో చూడాలి.
ఇప్పటికే విడుదలైన సిటాడెల్: హనీ బన్నీ ట్రైలర్‌లో ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా సిరీస్ కనిపించింది. ఇందులో కే కే మీనన్, సిమ్రాన్,సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, కష్వీ మజ్ముందర్ తదితరులు దర్శనమిచ్చారు.
టాపిక్