Samantha: కళ్లు తిరిగి పడిపోయిన సమంత, కంగారుపడిపోయి ‘ప్యాకప్’ చెప్పేసిన హీరో
Citadel Honey Bunny OTT: సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో సమంత యాక్షన్ సీన్స్‌లో అందర్నీ కట్టిపడేసింది. కానీ.. ఈ సీన్స్ చేసే సమయంలో రెండు సార్లు సమంత కళ్లు తిరిగి సెట్‌లోనే పడిపోయిందట.
సీనియర్ హీరోయిన్ సమంత షూటింగ్ మధ్యలో కళ్లు తిరిగి పడిపోయిందట. ఒకటి కాదు.. రెండు సార్లు అలా సమంత కళ్లు తిరిగి పడిపోయిందని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన కొత్త స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.
సిటాడెల్: హనీ బన్నీ సెట్స్ ‘‘సమంత షూటింగ్ మధ్యలో రెండు సార్లు కళ్లు తిరిగి పడిపోయింది. నేను చాలా కంగారుపడిపోయా. ఒక రోజు షూటింగ్ జరుగుతుండగా.. సమంత కళ్ళు మూసుకుని.. ఇది ఆరోజుల్లో ఒకటి అంటూ కళ్లు తిరిగి పడిపోయింది. అప్పటికే మేము రెండు గంటలకి పైగా షూట్ చేశాము. సమంత పరిస్థితిని గమనించి డైరెక్టర్స్ షూటింగ్ బ్రేక్ ఇవ్వగా.. కొద్దిసేపటికే ఆక్సిజన్ ట్యాంకు సమంత కోసం షూటింగ్ స్పాట్‌కి వచ్చింది’’ అని వరుణ్ ధావన్ గుర్తు చేసుకున్నాడు.
వాస్తవానికి సమంత రెస్ట్ తీసుకోవచ్చు. కానీ.. ఆమె షూటింగ్ ఆగకూడదనే కమిట్‌మెంట్‌తో సెట్స్‌కి వచ్చిందని వరుణ్ ధావన్ ప్రశంసించాడు. ఇక రెండో సారి ‘‘సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్‌లో షూటింగ్ చేస్తుండగా సమంత నా వెనుక పరుగెత్తాల్సిన సీన్‌ను షూట్ చేస్తున్నాం. నేను కెమెరాని చూస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లిపోయా.. ఆమె నా వెనుక వస్తూ సడన్‌గా కళ్లు తిరిి కుప్పకూలిపోయింది. వెంటనే కంగారుగా ఆమెని నా చేతుల్లోకి తీసుకుని.. ప్యాకప్ చెప్పేశాను’’ అని వరుణ్ ధావన్ గుర్తు చేసుకున్నాడు.
మయోసైటిస్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్న సమంత.. గత ఏడాదికాలంగా మళ్లీ సినిమాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీమెన్ -2 వెబ్ సిరీస్‌లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో నటించిన సమంత.. సిటాడెల్: హనీ బన్నీలోనూ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. ఒక ఏజెంట్‌గానే కాదు.. తల్లిగా కూడా సమంత ఈ వెబ్ సిరీస్‌లో బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
వాస్తవానికి మయోసైటిస్ కారణంగా ఈ వెబ్ సిరీస్‌లో నటించలేనని తొలుత సమంత చెప్పిందట. కానీ.. దర్శకులు రాజ్ అండ్ డీకే మాత్రం సమంత కోలుకునే వరకూ వెయిట్ చేసి.. పట్టుబట్టి మరీ ఆమెతో నటింపజేసినట్లు వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ప్రియాంక చోప్రా నటించిన రుస్సో బ్రదర్స్ 2023 గూఢచర్యం షోకి ఈ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇండియా వెర్షన్. 1990ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఈ వెబ్ సిరీస్ ఉండగా.. ఒక్కో ఎపిసోడ్ 43 నుంచి 54 నిమిషాల వరకూ ఉన్నాయి.