Cirkus trailer: రణ్‌వీర్, పూజా మధ్యలో దీపికా.. నవ్వులు పూయిస్తున్న సర్కస్ ట్రైలర్
Cirkus trailer: రణ్‌వీర్, పూజా మధ్యలో దీపికా.. ఇలా రోహిత్ శెట్టి మరోసారి తనదైన స్టైల్లో నవ్వులు పూయిస్తూ తీసుకొస్తున్న మూవీ సర్కస్. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (డిసెంబర్ 2) రిలీజైంది.
Cirkus trailer: బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి సినిమాలంటే నవ్వులు గ్యారెంటీ. గోల్‌మాల్ సిరీస్, బోల్ బచ్చన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం, సింబాలాంటి మూవీస్‌తో తనదైన మార్క్ చూపించాడు. ఇప్పుడతడు మరోసారి రణ్‌వీర్ హీరోగా తీసుకొస్తున్న మూవీ సర్కస్. 1960ల నేపథ్యంలో సాగే ఈ సినిమా మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లనుంది. ఈ మధ్యే టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. శుక్రవారం (డిసెంబర్ 2) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
సర్కస్‌లో రణ్‌వీర్ సరసన పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుండగా.. దీపికా పదుకోన్ ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌తో మెరవనుంది. ఈ ట్రైలర్ మొత్తం చాలా ఫన్నీగా సాగింది. డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా సర్కస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రణ్‌వీర్‌తోపాటు పక్కనే కనిపించే వరుణ్ కూడా డ్యుయల్ రోల్‌లో కనిపిస్తున్నారు. కరెంటును ముట్టుకున్నా షాక్ కొట్టని ఓ వింత క్యారెక్టర్‌లో రణ్‌వీర్ నటించాడు.
ట్రైలర్ చివర్లో స్పెషల్ డ్యాన్స్ నంబర్‌తో దీపికా సర్‌ప్రైజ్ చేసింది. పింక్ శారీలో చాలా క్యూట్‌గా కనిపించిన దీపికా.. రణ్‌వీర్‌తో కలిసి మాస్ స్టెప్పులేసింది. 1982లో వచ్చిన అంగూర్ సినిమా ఆధారంగా ఈ సర్కస్ మూవీ తెరకెక్కింది. నిజానికి 1968లో వచ్చిన దో దూనీ చార్ మూవీ రీమేక్ అంగూర్ కాగా.. ఆ సినిమాను ఇప్పుడు మళ్లీ సర్కస్ పేరుతో తీయడం విశేషం.
రోహిత్ శెట్టితో ఇప్పటికే సింబా, సూర్యవంశి సినిమాలు తీసిన రణ్‌వీర్ ముచ్చటగా మూడోసారి సర్కస్ మూవీతో వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ కామెడీతో అదుర్స్ అనిపిస్తుంది. దీంతో సర్కస్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి వీళ్ల చివరి సినిమా సూర్యవంశి నిరాశ పరిచినా.. సర్కస్‌తో మరోసారి హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
అటు రణ్‌వీర్ చివరి సినిమా జయేష్‌భాయ్ జోర్దార్ కూడా అంతగా ఆడలేదు. దీంతో అతడు కూడా సర్కస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత రణ్‌వీర్.. కరణ్ జోహార్‌తో కలిసి రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాలో రణ్‌వీర్ సరసన ఆలియా నటిస్తోంది. ఇక ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మిలాంటి సీనియర్ నటులు కూడా ఇందులో నటిస్తుండటం విశేషం.