Chris Martin from Telangana: నాది తెలంగాణ అన్న క్రిస్ మార్టిన్.. గద్దర్ పాటను గుర్తు చేస్తూ విజయ్ దేవరకొండ రియాక్షన్-chris martin says he is from telangana vijay deverakonda reaction gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chris Martin From Telangana: నాది తెలంగాణ అన్న క్రిస్ మార్టిన్.. గద్దర్ పాటను గుర్తు చేస్తూ విజయ్ దేవరకొండ రియాక్షన్

Chris Martin from Telangana: నాది తెలంగాణ అన్న క్రిస్ మార్టిన్.. గద్దర్ పాటను గుర్తు చేస్తూ విజయ్ దేవరకొండ రియాక్షన్

Hari Prasad S HT Telugu

Chris Martin from Telangana: నాది తెలంగాణ అంటూ కోల్డ్‌ప్లే బ్యాండ్ మెంబర్, బ్రిటీష్ సింగర్ క్రిస్ మార్టిన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఈ సందర్భంగా అతడు గద్దర్ పాటను గుర్తు చేయడం విశేషం.

నాది తెలంగాణ అన్న క్రిస్ మార్టిన్.. గద్దర్ పాటను గుర్తు చేస్తూ విజయ్ దేవరకొండ రియాక్షన్

Chris Martin from Telangana: బ్రిటీష్ సింగర్, కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన సభ్యుడు అయిన క్రిస్ మార్టిన్ తనది తెలంగాణ అని అందరికీ తెలుసు అంటూ జోక్ చేసిన వీడియో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం (జనవరి 28) స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. అహ్మదాబాద్ లో జరిగిన కోల్డ్‌ప్లే చివరి కాన్సర్ట్ లో క్రిస్ మార్టిన్ ఇండియాలోని సౌత్ స్టేట్స్ గురించి చెబుతూ.. తాను తెలంగాణకు చెందిన వాడినని జోక్ చేశాడు.

క్రిస్ మార్టిన్ కామెంట్స్ విజయ్ రియాక్షన్ ఇదీ

క్రిస్ మార్టిన్ అహ్మదాబాద్ కాన్సర్ట్ లో తన బ్యాండ్ సభ్యులను పరిచయం చేస్తూ తమదీ ఇండియన్ బ్యాండే అని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లమంటూ జోక్ చేశాడు. మీకు తెలియని విషయం ఏంటంటే.. మేం నలుగురు ఇండియాలోనే పుట్టాం.

కాబట్టి మాది ఇండియన్ బ్యాండ్.. బేసిస్ట్ గయ్ బెరీమ్యాన్ తమిళనాడుకు చెందిన వాడు.. అందరికీ తెలుసు నేను తెలంగాణ వాడిని అని క్రిస్ మార్టిన్ అన్నాడు. ఈ మాట తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా మంగళవారం (జనవరి 28) తన ఇన్‌స్టా స్టోరీస్ లో క్రిస్ మార్టిన్ వీడియోను షేర్ చేస్తూ గద్దర్ పాటను కూడా గుర్తు చేసుకున్నాడు.

ఎవరైనా మాషప్ చేయండి: విజయ్

క్రిస్ మార్టిన్ వీడియోను షేర్ చేస్తూ.. "నాది తెలంగాణ అని క్రిస్ మార్టిన్ అంటున్నాడు. క్రిస్ మార్టిన్ వెల్కమ్. ఎవరైనా పొడుస్తున్న పొద్దుమీద, కోల్డ్ ప్లే మాషప్ చేయండి" అనే క్యాప్షన్ ఉంచాడు. దివంగత గద్దర్ రాసి, పాడిన పాట ఈ పొడుస్తున్న పొద్దుమీద.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పాట ఓ ఊపు ఊపేసింది. ఆ పాటను కోల్డ్ ప్లేతో కలిసి మాషప్ చేయండంటూ విజయ్ దేవరకొండ కోరడం విశేషం. విజయ్ గతేడాది ది ఫ్యామిలీ స్టార్ మూవీతోపాటు కల్కి 2898 ఏడీలో గెస్ట్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంకృత్యాన్, కిరణ్ కోలాలతో కలిసి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

కోల్డ్‌ప్లే ఇండియా కాన్సర్ట్స్

బ్రిటీష్ బ్యాండ్ కోల్డ్‌ప్లే ఇండియా టూర్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ముంబైలో రెండు, అహ్మదాబాద్ లో రెండు కాన్సర్ట్‌లు నిర్వహించారు. గత ఆదివారం (జనవరి 26) నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి కాన్సర్ట్ జరిగింది. దీనికి ఏకంగా 1.34 లక్షల మంది హాజరయ్యారు.

ఇండియాలో ఇదే అతిపెద్ద కాన్సర్ట్ గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ కాన్సర్ట్ ముగిసిన మరుసటి రోజే క్రిస్ మార్టిన్ తన గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ తో కలిసి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీ
విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీ

సంబంధిత కథనం