Hollywood: 1400 కోట్ల హాలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ డేట్ ఇదే!-chris hemsworth furiosa a mad max saga streaming on amazon prime video from this date hollywood ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hollywood: 1400 కోట్ల హాలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Hollywood: 1400 కోట్ల హాలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Furiosa A Mad Max Saga: హాలీవుడ్ మూవీ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా

Furiosa A Mad Max Saga: హాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ మూవీ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. 168 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్ (1400 కోట్లు) తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. 150 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో (Hollywood) బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

నెల రోజుల్లోనే ఓటీటీలోకి...

మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన స‌రిగ్గా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా మూవీ రిలీజ్ కానుంది. రెంట‌ల్ విధానంలో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

ఐదో మూవీ...

మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్ ఫ్రాంచైజ్‌లో ఐదో మూవీగా ఫ్యూరియోసా మ్యాడ్ మాక్స్ సాగా మూవీ రూపొందింది. మ్యాడ్ మ్యాక్ సిరీస్‌లో భాగంగా 2015లో రిలీజైన మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీ ఆరు ఆస్కార్ అవార్డుల‌ను గెలుచుకున్న‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా మూడు వేల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దాంతో మ్యాడ్ మ్యాక్ ఫ్యూరియోసా మూవీపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ బాగున్నా క‌థ‌, క‌థ‌నాలు, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఎక్కువ‌గా సాగ‌తీయ‌డం, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా లేక‌పోవ‌డంతో ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఫ్యూరియోసా రివేంజ్‌...

మ్యాడ్‌మ్యాక్స్ ఫ్యూరియోసా మూవీలో అన్యా టేల‌ర్ జాయ్‌, క్రిస్ హెమ్స్‌వ‌ర్త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జార్జ్ మిల్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.త‌ల్లి మేరీతో క‌లిసి ఫ్యూరియోసా (అన్యా టేల‌ర్ జాయ్‌) ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. బైక‌ర్స్ గ్యాంగ్ కార‌ణంగా ఫ్యూరియోసా లైఫ్ మొత్తం త‌ల‌క్రిందులు అవుతోంది. ఫ్యూరియోసా క‌ళ్ల ముందే ఆమె త‌ల్లిని బైక‌ర్స్ గ్యాంగ్ లీడ‌ర్ డెమంట‌స్ (క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌) చంపేస్తాడు.

ఫ్యూరియోసాను ఇమ్మోర్ట‌న్ జో అనే రాజుకు బ‌హుమ‌తిగా అప్ప‌గిస్తాడు డెమంట‌స్‌. ఇమ్మోర్ట‌న్ జో నుంచి త‌ప్పించుకున్న ఫ్యూరియోసా సిటాడెల్ సైన్యంలో చేరుతుంది. సిటాడెల్ సైన్యాధిప‌తి జాక్‌కు న‌మ్మిన‌బంటుగా మారుతుంది. జాక్ స‌హాయంతో డెమంట‌స్‌పై ప‌గ‌ను తీర్చుకోవాల‌ని అనుకుంటుంది. ఫ్యూరియోసా ప్ర‌య‌త్నం నెర‌వేరిందా? ఈ పోరాటంలో ఆమె ఎలాంటి సాహ‌సాలు చేసింది అన్న‌దే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా క‌థ‌.

విల‌న్‌గా క్రిస్స్ హెమ్స్‌వ‌ర్త్‌...

మార్వెల్ సిరీస్‌లో థోర్ గా సూప‌ర్ హీరో పాత్ర‌లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న క్రిస్ హెమ్స్‌వ‌ర్త్ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. త‌న విల‌నిజంతో అద‌ర‌గొట్టాడు. ఫ్యూరియోసా పాత్ర‌లో అన్యా టేల‌ర్ జాయ్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

ఇండియాలోనూ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మాక్స్ సాగా మూవీ ఇర‌వై కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఇండియాలోనే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్‌లో స‌గం మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిరాశ‌ప‌రిచింది. మ్యాడ్ మ్యాక్ సిరీస్‌లో ఆరు భాగం కూడా రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.