Extraction 2 Release Date: ఎక్స్‌ట్రాక్ష‌న్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌ - సీక్వెల్ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌-chris hemsworth extraction 2 to stream on netflix from june 16 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Extraction 2 Release Date: ఎక్స్‌ట్రాక్ష‌న్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌ - సీక్వెల్ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌

Extraction 2 Release Date: ఎక్స్‌ట్రాక్ష‌న్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌ - సీక్వెల్ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 04, 2023 11:17 AM IST

Extraction 2 Release Date: క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌ హీరోగా న‌టిస్తోన్న ఎక్స్‌ట్రాక్ష‌న్ 2 సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. డైరెక్ట్‌గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌
క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌

Extraction 2 Release Date: మార్వెల్ సినిమాల్లో థోర్ క్యారెక్ట‌ర్‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ అభిమానుల‌కు చేరువ‌య్యాడు క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌. అత‌డు హీరోగా 2020లో ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చిన ఎక్స్‌ట్రాక్ష‌న్ మూవీ యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకొంది.

yearly horoscope entry point

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఎక్స్‌ట్రాక్ష‌న్ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీక్వెల్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. ఇందులో జైలులో ఉన్న ఓ యువ‌తిని ర‌క్షించ‌డానికి క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌ప్ర‌య‌త్నించి విఫ‌లం కావ‌డం ఆ త‌ర్వాత కోమాలోకి వెళ్లిపోయిన‌ట్లుగా చూపించారు. ఆ తర్వాత తాను ఎక్క‌డైతే విఫ‌ల‌మ‌య్యాడో అదే ప్లేస్ నుంచి త‌న పోరాటాన్ని కంటిన్యూ చేసిన‌ట్లుగా ఈ ట్రైల‌ర్‌లో చూపించారు.

చివ‌ర‌లో మంచు కొండ‌ల్లో హెలికాప్ట‌ర్‌పై గ‌న్‌తో క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌ ఎటాక్ చేసే సీన్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. క‌రోనా కార‌ణంగా ఎక్స్‌ట్రాక్ష‌న్ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. తాజాగా సీక్వెల్‌ను కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జూన్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix)ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఎక్స్‌ట్రాక్ష‌న్ సీక్వెల్‌కు సామ్ హ‌ర్‌గ్రేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. గ‌తంలో అత‌డు మార్వెల్ సూప‌ర్ సిరీస్‌ సినిమాల‌తో పాటు హంగ‌ర్ గేమ్స్ చిత్రాల‌కు యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు. ఎక్స్‌ట్రాక్ష‌న్‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.ఫ‌స్ట్ పార్ట్‌కు ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌సీక్వెల్ నిర్మాణంలో భాగం అయ్యాడు.

Whats_app_banner