Jani Master: ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు.. నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ కామెంట్స్-choreographer jani master felicitation ceremony for 70th national film awards best choreographer jani master comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jani Master: ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు.. నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ కామెంట్స్

Jani Master: ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు.. నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 19, 2024 06:36 AM IST

Jani Master About Heroes In Felicitation Ceremony: ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ దక్కించుకున్న తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు.. నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ కామెంట్స్
ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు.. నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ కామెంట్స్

Felicitation To Choreographer Jani Master: ఇటీవల ప్రకటించిన 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తిరుచిత్రాంబలం (తెలుగులో తిరు) సినిమాలోని మేఘం కరుగత పాటకు జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో జానీ మాస్టర్‌కు ఘనంగా సన్మానం చేశారు.

కామెంట్స్ వైరల్

ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులు మమ్మల్ని ఎప్పుడూ బాగా సపోర్ట్ చేస్తుంటారు. సినిమాకు ఆది, అంతం నిర్మాతే. ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు. నిర్మాత క్యాషియర్‌గా ఉండటం చూస్తున్నాం. కానీ, ఆయన కూడా హీరోలాగే ఉండాలి" అని జానీ మాస్టర్ అన్నారు.

ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా

"ప్రభుదేవా గారు చేసిన వెన్నెలవే వెన్నెలవే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇలాంటి పాట ఒకటి నేనూ చేయాలనే కలగనేవాడిని. ఆ అవకాశం ధనుష్ గారి తిరుచిత్రాంబలంతో నాకు దక్కింది. అక్కడ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసేందుకు నన్నే పిలిపించారు ధనుష్ గారు. ధనుష్ గారికి, తిరుచిత్రాంబలం మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా" అని జానీ మాస్టర్ తెలిపారు.

"మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నాం అంటే అందుకు ముక్కురాజు మాస్టర్, నా ముందున్న డ్యానర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన కృషే కారణం. ముక్కురాజు మాస్టర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని మద్రాస్ నుంచి తెలుగు డ్యాన్సర్స్ ను ఇక్కడికి తీసుకొచ్చి అసోసియేషన్ స్థాపించి నిలబెట్టారు. ఆ పెద్దలు వేసిన బాటలో మేమంతా నడుస్తూ ముందుకెళ్తున్నాం" అని జానీ మాస్టర్ పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం మెసేజ్ చేశారు

"మన మాస్టర్స్ ఎన్నో ట్రెండీ స్టెప్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు డ్యాన్స్ మాస్టర్స్‌కు బాగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు. నాకు నేషనల్ అవార్డ్ రాగానే డిఫ్యూటీ సీఎం పవన్ గారు అభినందిస్తూ మెసేజ్ పంపారు. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఏది సాధించినా ఆ క్రెడిట్ నన్ను ప్రోత్సహించిన మా అమ్మా నాన్నలకే చెందుతుంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు" అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. "నేను, గణేష్, జానీ దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఈరోజు జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మా అందరికీ ఆ అవార్డ్ వచ్చినట్లు ఆనందిస్తున్నాం. గతంలో నార్త్‌కు కొరియోగ్రఫీలో నేషనల్ అవార్డ్స్ వచ్చేవి. ఇప్పుడు మనకు రావడం మొదలైంది. జానీ విజయానికి మేమంతా గర్విస్తున్నాం" అని తెలిపారు.