Choo Mantar OTT Release: ఓటీటీలో ఎన్ని రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే జోనర్ హారర్. ఈ జోనర్‌లో కథ ఎలా ఉన్న థ్రిల్లింగ్ నెరేషన్‌తో భయపెట్టే సీన్స్‌తో మూవీ తెరకెక్కిస్తే మంచి హిట్ అందుకుంటుంది.
ఇక ఇటీవల కాలంలో కేవలం ఒక హారర్ జోనర్‌లోనే కాకుండా వాటికి అదనంగా కామెడీ, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ వంటి ఎలిమెంట్స్ జోడించి మరింత ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా థియేటర్లలో విడదలైన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీనే ఛూ మంతర్. కన్నడ ఇండస్ట్రీలో జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అయితే, కన్నడ నుంచి ఈ ఏడాది 3 నెలల్లో 60 సినిమాలు రిలీజ్ కాగా అవన్నీ ఫెయిల్యూర్‌గా మిగలాయి. కానీ, సంక్రాంతి కానుకగా విడుదలైన ఛూ మంతర్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుని బడ్జెట్ కంటే మోస్తరు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో శాండిల్ వుడ్‌లో ఛూ మంతర్ స్పెషల్ సినిమాగా మారింది.
ఛూ మంతర్ మూవీకి నవనీత్ కథ, దర్శకత్వం వహించారు. తరుణ్ స్టూడియోస్ బ్యానర్‌పై తరుణ్ శివప్ప నిర్మించిన ఈ సినిమాలో కన్నడ పాపులర్ నటుడు శరణ్, అదితి ప్రభుదేవా, చిక్కన్న, మేఘన గవోన్కర్, ప్రభు ముండ్కర్, రజనీ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక పాపులర్ యాక్టర్ శరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఆయన రెండు టైమ్ పీరియడ్స్‌లో అతీత శక్తులను కంట్రోల్ చేసే నిపుణిడి పాత్రలు పోషించారు.
ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఛూ మంతర్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సుమారు రెండున్నర నెలలకు ఛూ మంతర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మార్చి 28 శుక్రవారం నాడు అమెజాన్ ప్రైమ్‌లో ఛూ మంతర్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, కేవలం కన్నడ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది.
భాషా బేధం లేని ఓటీటీ ప్రియులు మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఛూ మంతర్ సినిమాను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. మరి థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఛూ మంతర్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఛూ మంతర్ స్టోరీలోకి వెళ్తే.. ఓ ఫ్యామిలీ ఒక మహల్‌లోకి నివసించడానికి వెళ్తుంది. అక్కడ అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి.
ఆ మహల్ గురించి అక్కడున్న ప్రజలు ఏవేవే కథలు భయంగా చెప్పుకుంటారు. మరి ఆ మహల్‌కు ఉన్న కథ ఏంటీ, అందులో ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలతో ఛూ మంతర్ సినిమా తెరకెక్కింది. కథ రొటీన్‌గా ఉండే భయపెట్టే సీన్స్, కొత్తదనం ఉంటుందని ఛూ మంతర్ ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది.
సంబంధిత కథనం