Chiyaan Vikram Bollywood Movie: కంగ‌నా ర‌నౌత్ సినిమాలో విక్ర‌మ్ గెస్ట్ రోల్‌-chiyaan vikram to a play cameo role in kangana ranaut sita the incarnation movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiyaan Vikram To A Play Cameo Role In Kangana Ranaut Sita The Incarnation Movie

Chiyaan Vikram Bollywood Movie: కంగ‌నా ర‌నౌత్ సినిమాలో విక్ర‌మ్ గెస్ట్ రోల్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 03, 2022 11:18 AM IST

Chiyaan Vikram Bollywood Movie: పొన్నియ‌న్ సెల్వ‌న్‌తో చాలా రోజుల త‌ర్వాత బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్కించుకున్నాడు విక్ర‌మ్‌. ఈ సినిమాలో చోళ‌యువ‌రాజుగా చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించాడు. తాజాగా విక్ర‌మ్ బాలీవుడ్‌లో ఓ పౌరాణిక సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఆ సినిమా ఏదంటే...

విక్ర‌మ్‌
విక్ర‌మ్‌ (Twitter)

Chiyaan Vikram Bollywood Movie: పొన్నియ‌న్ సెల్వ‌న్ (Ponniyan selvan) సినిమాలో చోళ యువ‌రాజు క‌రికాళుడిగా ఇంటెన్స్‌రోల్‌లో చ‌క్క‌టి న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు హీరో విక్ర‌మ్‌. ప్రేమ‌కు, కుటుంబ బంధాల‌కు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొనే పాత్ర‌లో విక్రమ్ ఎమోష‌న్స్ పండించిన తీరుపై ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

మ‌ణిర‌త్నం (Maniratnam)ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. మూడు రోజుల్లోనే వంద కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. త‌మిళంతో పాటు తెలుగు, బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతున్న‌ది.

కాగా విక్ర‌మ్ బాలీవుడ్‌లో ఓ పౌరాణిక సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కంగ‌నా ర‌నౌత్ (Kangana ranaut)క‌థానాయిక‌గా సీత ది ఇంకార్నేష‌న్ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు అలౌకిక్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాముడిని పెళ్లి చేసుకోక‌ముందు సీత జ‌ర్నీని ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సీత పుట్టుక‌, జ‌న‌క మ‌హారాజు ఆమెను ద‌త్త‌త తీసుకోవ‌డం వంటి అంశాల‌ను ఇందులో ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు తెలిసింది. మైథ‌లాజిక్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో త‌మిళ హీరో విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అతిథి పాత్రే అయినా సినిమాలో ఆయ‌న చాలా స‌మ‌యం పాటు క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌లే విక్ర‌మ్‌ను ది సీత ఇంకార్నేష‌న్ ద‌ర్శ‌కుడు అలౌకిక్ దేశాయ్ క‌లిసిన ఫొటోలు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గెస్ట్ రోల్ గురించే ద‌ర్శ‌కుడు... విక్ర‌మ్‌ను క‌లిసిన‌ట్లు స‌మాచారం. క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో విక్ర‌మ్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

సీత ది ఇంకార్నేష‌న్ సినిమాకు బాహుబ‌లి ఫేమ్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నాడు. పాన్ ఇండియ‌న్ స్థాయిలో బాలీవుడ్‌తో పాటు మిగిలిన భాష‌ల్లోసీత ది ఇంకార్నేష‌న్ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.