Thangalaan Release Date: విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ చెప్పేశాడు-chiyaan vikram thangalaan to release on 15th august confirms producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thangalaan Release Date: విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ చెప్పేశాడు

Thangalaan Release Date: విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ చెప్పేశాడు

Hari Prasad S HT Telugu
Published Jul 01, 2024 10:05 PM IST

Thangalaan Release Date: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ రిలీజ్ డేట్ రివీలైంది. మూవీ ప్రొడ్యూసరే ఈ తేదీని కన్ఫమ్ చేయడం విశేషం.

విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ చెప్పేశాడు
విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ చెప్పేశాడు

Thangalaan Release Date: ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన విక్రమ్ తంగలాన్ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రొడ్యూసర్ ధనంజయన్ కూడా కన్ఫమ్ చేశాడు. గలాటాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా రిలీజ్ తేదీని వెల్లడించాడు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

తంగలాన్ రిలీజ్ డేట్

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్న మూవీ తంగలాన్. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్నిసార్లు రిలీజ్ డేట్ వెల్లడించి మళ్లీ వాయిదా వేశారు. చివరికి ఆగస్ట్ 15న మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసరే చెప్పడంతో ఇది కన్ఫమ్ అయినట్లే.

కర్ణాటకలోకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ఈ తంగలాన్. పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయింది. దీంతో ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందని భావించారు. కానీ తర్వాత పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.

ట్రైలర్ వచ్చేస్తోంది..

మొత్తానికి ఆగస్ట్ 15న రిలీజ్ అని చెప్పడంతో విక్రమ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ కూడా సోమవారం (జులై 1) ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ.. "తంగలాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తయింది. నా బెస్ట్ ఇచ్చాను. అద్భుతమైన సినిమా.. ఆతృతగా ఎదురు చూస్తున్నాను. పిచ్చెక్కించే ట్రైలర్ కూడా త్వరలోనే రాబోతోంది. ఇండియన్ సినిమా తంగలాన్ కోసం సిద్ధంగా ఉండు" అని రాశాడు.

నిజానికి ఆగస్ట్ 15న పుష్ప 2 రిలీజ్ అవుతుందని చాలా రోజులుగా ఆ మూవీ మేకర్స్ చెప్పడంతో చాలా సినిమాలు ఆ డేట్ ను వదిలేసుకున్నాయి. అయితే ఇప్పుడా సినిమా డిసెంబర్ కు వాయిదా పడటంతో ఇటు తెలుగులో డబుల్ ఇస్మార్ట్, తమిళంలో ఈ తంగలాన్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియాలో వివిధ భాషల్లో రాబోతున్నాయి.

తంగలాన్ రిలీజ్ డేట్ ను విక్రమ్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడు. ఈ నెలలోనే మూవీ ట్రైలర్ కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తంగలాన్ మూవీలో విక్రమ్ తోపాటు మాళవికా మోహనన్, పశుపతి, పార్వతి తిరువోతులాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయేలా ఉంది. ఇందులో అతడు అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. కేజీఎఫ్ అసలు కథను ఈ సినిమా ద్వారా ప్రపంచం ముందుకు తీసుకురానున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.

దీని కారణంగానే ఇండియాను బ్రిటీష్ వాళ్లు బంగారు పక్షిగా పిలిచేవాళ్లు. ఈ కేజీఎఫ్ నుంచే వాళ్లు సుమారు 900 టన్నుల బంగారాన్ని ఇంగ్లండ్ కు తీసుకెళ్లారు. ఈ కేజీఎఫ్ వెనుక దాగి ఉన్న అసలు స్టోరీ చాలా మందికి తెలియదు. ఇప్పుడా విషయాన్ని తమ తంగలాన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ చెప్పారు.

Whats_app_banner