Chiyaan Vikram: ఐదు నిమిషాల ముందే థియేటర్‌లో ఉండండి.. ఎందుకంటే.. హీరో చియాన్ విక్రమ్ కామెంట్స్-chiyaan vikram comments on sj suryah veera dheera soora in pre release event says sit in theaters before five minutes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiyaan Vikram: ఐదు నిమిషాల ముందే థియేటర్‌లో ఉండండి.. ఎందుకంటే.. హీరో చియాన్ విక్రమ్ కామెంట్స్

Chiyaan Vikram: ఐదు నిమిషాల ముందే థియేటర్‌లో ఉండండి.. ఎందుకంటే.. హీరో చియాన్ విక్రమ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Chiyaan Vikram About SJ Suryah And Veera Dheera Soora: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వీర ధీర శూర. ఎస్‌జే సూర్య మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 22న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తెలుగు ఆడియెన్స్, సూర్య, వీర ధీర శూరపై విక్రమ్ కామెంట్స్ చేశాడు.

ఐదు నిమిషాల ముందే థియేటర్‌లో ఉండండి.. ఎందుకంటే.. హీరో చియాన్ విక్రమ్ కామెంట్స్

Chiyaan Vikram About SJ Suryah And Veera Dheera Soora: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర శూర. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ ఎస్‌జే సూర్య, మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరాముడు, హీరోయిన్ దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వీర ధీర శూర ప్రీ రిలీజ్ ఈవెంట్

మార్చి 27న గ్రాండ్‌గా వీర ధీర శూర సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు వీర ధీర శూర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తెలుగు ఆడియెన్స్, వీర ధీర శూర, సినిమాలోని నటీనటుల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

హీరో విక్రమ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మాస్ సినిమాలు చేస్తున్నాను. కానీ, రస్టిక్‌గా ఉండే సినిమా చేసి చాలా రోజులైంది. ఫ్యాన్స్ కోసం మంచి రస్టిక్ యాక్షన్ ఉన్న ఒక సినిమా చేయాలని నేను డైరెక్టర్ అరుణ్ అనుకున్నాం. యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది" అని అన్నాడు.

సూర్య సినిమాలకు ఫ్యాన్‌ని

"ఇలాంటి సినిమాలు చేయడానికి మంచి పెర్ఫార్మర్స్ కావాలి. ఈ సినిమా కోసం మేము ఫస్ట్ అప్రోచ్ అయిన యాక్టర్ సూర్య గారు. ఆయన ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్యారెక్టర్‌కి సూర్య గారు అయితేనే పర్ఫెక్ట్ . నేను ఎస్‌జే సూర్య గారి సినిమాలకి బిగ్ ఫ్యాన్‌ని" అని హీరో విక్రమ్ తెలిపాడు.

"యాక్టర్‌గా ఆయన (ఎస్‌జే సూర్య) చాలా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు. ఒక పాత్రతో మరో పాత్రకి చాలా వైవిధ్యం ఉంటుంది. యాక్టర్‌గా ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో సూర్య గారితో కలసి యాక్ట్ చేయడం వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్. దుషారా విజయన్ గారు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్ మెమొరబుల్‌గా ఉంటుంది" అని విక్రమ్ చెప్పాడు.

టర్నింగ్ పాయింట్

"పృథ్వీ గారికి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రసాద్ గారు లక్కీ హ్యాండ్. ఆయన మా సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది డిఫరెంట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. డైరెక్టర్ అరుణ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఒక ఆడియన్‌గా ఇలాంటి సినిమాని చూడడానికి ఇష్టపడతాను. జీవీ ప్రకాష్ కుమార్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు" అని విక్రమ్ పేర్కొన్నాడు.

"ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని గ్రాండ్‌గా నర్మించారు. తెలుగులో అన్ని రకాల సినిమాలు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్నాయి. యాక్టర్స్‌కి ఇది చాలా గొప్ప అవకాశం. అన్ని రకాల పాత్రలు చేసే ఛాన్స్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ అద్భుతం. వారి ప్రేమకి నా కృతజ్ఞతలు" అని విక్రమ్ చెప్పుకొచ్చాడు.

అందుకే ఐదు నిమిషాల ముందే

"మార్చి 27న ఈ సినిమా వస్తోంది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. కచ్చితంగా మీరంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలైపోతుంది. అందుచేత ఒక ఫైవ్ మినిట్స్ (ఐదు నిమిషాలు) ముందే థియేటర్‌లో ఉండేలా చూసుకోవాలని, సినిమా బిగినింగ్ ఎవ్వరు మిస్ అవ్వకూడదని ప్రేక్షకులుని కోరుతున్నాను" అని చియాన్ విక్రమ్ కోరాడు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం