తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిలర్ మూవీకి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పార్ట్ 1 కంటే ముందు ఈ మూవీ పార్ట్ 2 వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మంచి వసూళ్లను సాధించింది. ఈ వీర ధీర శూరన్ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. స్ట్రీమింగ్‍లో అదగొడుతోంది.
వీర ధీర శూరన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. భారీ వ్యూస్‍తో దుమ్మురేపుతోంది. దీంతో ఈ సినిమా ప్రస్తుతం (ఏప్రిల్ 26) ప్రైమ్ వీడియో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది. ఈ మూవీ ఈ గురువారం ఏప్రిల్ 24న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే వీర ధీర శూరన్ మూవీ ట్రెండింగ్‍లో అగ్రస్థానానికి వచ్చేసింది. ఈ చిత్రానికి ఐదు భాషల్లోనూ మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ మూవీ ట్రెండింగ్‍లో ఎన్ని రోజులు జోరు చూపిస్తుందో చూడాలి.
వీర ధీర శూరన్ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చియాన్ విక్రమ్ నటనను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మాస్ పర్ఫార్మెన్స్, యాక్షన్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. డైరెక్టర్ అరుణ్ కుమార్ టేకింగ్, నరేషన్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.
వీర ధీర శూరన్ చిత్రంలో విక్రమ్‍తో పాటు ఎస్‍జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషరా విజయన్, పృథ్విరాజ్, మాలా పార్వతి, బాలాజీ, శ్రీజ రవి, సువేద, కలైయారాసన్ రాజ్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అరుణ్ కుమార్ తెరకెక్కించారు.
వీర ధీర శూరన్ సినిమా సుమారు రూ.55కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రం సుమారు రూ.65కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు హిట్ కొట్టింది. అయితే, ప్రశంసలను భారీగా సొంతం చేసుకుంది.
వీర ధీర శూరన్ మూవీని హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శింబు, శింబు తమీన్స్ ప్రొడ్యూజ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఇచ్చిన ఈ చిత్రానికి తెని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం