భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. 8 రోజుల్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) నుంచి తిరిగి రావాల్సిన ఆమె అక్కడే చిక్కుకున్నారు. 286 రోజుల పాటు ఐఎస్ఎస్‍లో అంతరిక్షంలోనే గడిపారు.
సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగామి బిచ్ విల్మోర్ కూడా ఐఎస్ఎస్‍లో చిక్కుకున్నారు. వీరు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం నేటి (మార్చి 19) తెల్లవారుజామున సునీత, విల్మోర్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్‍ఎక్స్‌కు చెందిన క్యాప్సూల్‍లో వీరు భూమి మీదకు వచ్చారు. ఈ విషయంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా భాషలో వెల్‍కమ్ చెప్పారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్టోరీ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్, గ్రేెటెస్ట్ అడ్వెంచర్ అంటూ నేడు చిరంజీవి ట్వీట్ చేశారు. వారికి భూమి మీదకు స్వాగతం చెప్పారు. “సునీతా విలియమ్స్, బిచ్ విల్మోర్.. మీకు భూమి మీదకు తిరిగి స్వాగతం. చరిత్రాత్మకం, హీరోయిక్ హోమ్ కమింగ్. ఎనిమిది రోజుల కోసం అంతరిక్షానికి వెళ్లి.. 286 రోజుల తర్వాత, భూమి చుట్టూ 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు” అని చిరంజీవి రాసుకొచ్చారు.
ఇదో నిజమైన బ్లూ బ్లాక్‍బస్టర్ అంటూ చిరంజీవి పేర్కొన్నారు. “మీ స్టోరీ డ్రమటిక్, ఉత్కంఠభరితమైన, నమ్మశక్యం కాని థ్రిల్లర్. ఇదో గొప్ప సాహసం. ఓ నిజమైన బ్లూ బ్లాక్‍బస్టర్!!. సునీతా విలియమ్స్.. మీకు మరింత శక్తి కలగాలి” అని చిరంజీవి ట్వీట్ చేశారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్, క్రూ9 టీమ్‍కు అభినందనలు తెలిపారు.
చిరంజీవి ప్రస్తుతం లండన్‍లో ఉన్నారు. యూకే పార్లమెంట్‍లో భాగమైన హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి లైఫ్‍టీమ్ ఆచీవ్‍మెంట్ అవార్డు అందుకునేందుకు ఆయన అక్కడికి చేరుకున్నారు. లండన్ వెళ్లిన చిరంజీవికి అభిమానుల నుంచి ఘనస్వాగతం దక్కింది. వెల్‍కమ్ అన్నయ్యా అంటూ చిరూకు యూకే అభిమానులు గ్రాండ్ వెల్‍కమ్ చెప్పారు. లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్‍ను నేడే అందుకోనున్నారు చిరంజీవి. కళారంగం నుంచి సమాజానికి చేసిన సేవలకు గాను హౌస్ ఆఫ్ కామన్స్ ఆయనకు అవార్డు అందజేసి, సత్కరించనుంది.
చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదల కావాల్సి ఉంది. కాస్త షూటింగ్ పెండింగ్‍లో ఉన్నట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండే ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడితోనూ ఓ మూవీని చేయనున్నారు చిరంజీవి. శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటున్నారు మెగాస్టార్.
సంబంధిత కథనం