Chirajeevi: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి తొలి ప్రేక్షకుడిగా చిరు - అనుష్క సినిమాకు మెగాస్టార్ సపోర్ట్
Chirajeevi: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించాడు. ట్విట్టర్ వేదికగా అనుష్క, నవీన్ పొలిశెట్టితో పాటు సినిమా యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు చిరంజీవి.
Chirajeevi: అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. అనుష్క, నవీన్ పొలిశెట్టి, డైరెక్టర్ మహేష్‌బాబుతో పాటు చిత్ర యూనిట్‌పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
ట్రెండింగ్ వార్తలు
సినిమా యూనిట్‌తో కలిసి దిగిన ఫొటోలను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మొదటి నుంచి చివరి వరకు హిలేరియన్ ఎంటర్‌టైనర్‌గా ఎంతగానో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తనను ఆకట్టుకున్నదని చిరంజీవి అన్నాడు. నేటి యువత ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ సరికొత్త కథాంశంతో డైరెక్టర్ మహేష్ బాబు పి ఈ సినిమాను తెరకెక్కించారని చిరంజీవి అన్నాడు.
జాతిరత్నాలు కు రెట్టింపు వినోదాన్ని ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి అందించాడని, కొంచెం తర్వాత కనిపిస్తోన్న మరింత బ్యూటీఫుల్‌గా ఉన్న దేవసేన అనుష్క ఈ సినిమాకు ప్రాణం పోసిందని చిరంజీవి ప్రశంసించాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి తొలి ప్రేక్షకుడిని తానే అంటూ ఫన్నీగా ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నాడు. సినిమాలోని హిలేరియస్ మూవ్‌మెంట్స్‌ను ఎంతగానో ఎంజాయ్ చేశానని చిరంజీవి అన్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 100 శాతం ఆడియెన్న్‌ను నవ్వుల బాట పట్టిస్తారనడంలో సందేహం లేదని ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నాడు. డైరెక్టర్ మహేష్ బాబు ను చిరంజీవి అభినందించారు. చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరోగసీ కాన్సెప్ట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మహేష్ బాబు పి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో అనుష్క తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాపిక్