Chiranjeevi Waltair Veerayya Teaser: చిరంజీవి వాల్తేర్ వీరయ్య టీజర్ రిలీజ్ - థియేటర్లలో పూనకాలే
Chiranjeevi Waltair Veerayya Teaser: దీపావళి సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా 154 మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు.
Chiranjeevi Waltair Veerayya Teaser: దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చాడుమెగాస్టార్ చిరంజీవి. మెగా 154సినిమా టైటిల్ తో పాటు టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ ను చాలా రోజుల క్రితమే చిరంజీవి రివీల్ చేశాడు. దీపావళి సందర్భంగా సోమవారం అఫీషియల్ గా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఫుల్ మాస్ అంశాలతో వాల్తేర్ వీరయ్య టీజర్ ఆసక్తికరంగా సాగింది.
ట్రెండింగ్ వార్తలు
ఎంట్రా ఆడొస్తే పూనకాలు అన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఏడ్రా మీ అన్నయ్య సౌండే లేదు అని విలన్ చెప్పిన డైలాగ్ తో ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమైంది. చేతిలో బీడీ పట్టుకొని మాస్ అవతారంలో చిరంజీవి స్టైలిష్ గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. పూల చొక్కా,లుంగీలో చిరంరజీవి డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు. ఇలాంటిఎంటర్ టైన్ మెంట్ ఇంకా చూడాలని అనుకుంటే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అని టీజర్ చివరలో చిరంజీవి సరదాగా డైలాగ్ చెప్పడం ఆసక్తిని పంచుతోంది.
చిరు బీడీ వెలిగించుకొని తనదైన మేనరిజమ్స్ తో వాకింగ్ చేసుకుంటూ వెళ్లే సీన్ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది. యాక్షన్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. చివరలో హ్యాపీ దివాళీ తొందరలోనే కలుద్దాం అంటూ రవితేజ (Raviteja) వాయిస్ ఓవర్ తో సినిమా రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కె.ఎస్ రవీంద్ర (బాబీ) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు నలభై ఐదు నిమిషాల నిడివి పాటు అతడి పాత్ర కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.