Telugu News  /  Entertainment  /  Chiranjeevi Waltair Veerayya Movie First Single Update Revealed
చిరంజీవి
చిరంజీవి

Waltair Veerayya First Single: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్ వ‌చ్చేసింది

13 November 2022, 18:15 ISTNelki Naresh Kumar
13 November 2022, 18:15 IST

Waltair Veerayya First Single: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమా ఫ‌స్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఆదివారం మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ అనౌన్స్ చేశాడు. ఈ సింగిల్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

Waltair Veerayya First Single: వాల్తేర్ వీర‌య్య అప్‌డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్‌. సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ ఈ వారంలోనే విడుద‌ల‌చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. బాస్ పార్టీ అనే ప‌ల్ల‌వితో సాగే ఈ మాస్ సాంగ్‌లో చిరంజీవితో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటాలా స్టెప్పులేసింది. బాస్ పార్టీ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఆదివారం ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు దేవిశ్రీప్ర‌సాద్‌.

ట్రెండింగ్ వార్తలు

బాస్ పార్టీ సాంగ్‌ను ఇప్పుడే చూసిన‌ట్లు రికార్డింగ్ రూమ్‌లో దిగిన ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. . ఈ పాట‌లో చిరంజీవి ఎన‌ర్జిటిక్ స్టెప్పులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయ‌ని, డ్యాన్స్ చూసిన ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక‌ ఈ న్యూస్‌ను లీక్ చేస్తోన్న‌ట్లు దేవిశ్రీప్ర‌సాద్ ట్వీట్ చేశాడు.

ఈ ఫ‌స్ట్ సింగిల్‌ను ఈ వారంలోనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దాదాపు న‌ల‌భై నిమిషాల పాటు ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.

వాల్తేర్ వీర‌య్య సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాల‌ర్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.