Vishwambhara Villain: విశ్వంభరకు సెట్ అయిన విలన్.. చిరంజీవిని ఢీ కొట్టే కమాండింగ్ పర్సనాలిటీ!
Chiranjeevi Vishwambhara Villain Kunal Kapoor: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర విలన్‌ను టీమ్ పరిచయం చేసింది. విశ్వంభర సెట్‌లో బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ అడుగు పెట్టారు. విశ్వంభరలో చిరంజీవిని ఢీ కొట్టే విలన్‌గా కునాల్ కపూర్ నటిస్తున్నట్లు టాక్.
Vishwambhara Villain Kunal Kapoor: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ 'విశ్వంభర'. ఈ సినిమాకుస సంబంధించిన అప్డేట్స్‌ను మేకర్స్ ఒక్కో అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్నీ క్రాఫ్ట్స్‌లో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర టీమ్ ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ అయన కునాల్ కపూర్‌ను పరిచయం చేస్తూ ఈ మ్యాజిస్టిక్ వరల్డ్‌కి స్వాగతించింది. కునాల్ కపూర్ బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్‌లలో ఒకరు.
కునాల్ కపూర్ ఇదివరకు రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా నాగార్జున, నాని కాంబినేషన్ మూవీ దేవదాసు సినిమాలో కూడా కునాల్ కపూర్ నటించారు. ఇప్పుడు ఈ కునాల్ కపూర్ విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యారు. ఆ పాత్ర విశ్వంభరలో విలన్ రోల్ అని టాక్ వస్తోంది. దీంతో అతని పేరు టాలీవుడ్‌లో మారు మోగిపోతోంది.
విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు గొప్ప అవకాశంగా కునాల్ కపూర్ చెప్పినట్లు సమాచారం. విశ్వంభరలో చిరంజీవిని కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ఢీ కొట్టనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, విశ్వంభరలో సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇది వరకు స్టాలిన్ సినిమాలో చిరంజీవితో త్రిష నటించింది. ఈ సినిమా 2006లో వచ్చింది. అంటే సుమారు 18 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో త్రిష జోడీ కట్టనుంది. అలాగే నా సామిరంగ, అమిగోస్ చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన ఆషికా రంగనాథ్ విశ్వంభరలోనూ నటిస్తోంది. దీంతో ఆమెకు చిరంజీవితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అయితే, ఆషికా కంటే ముందు విశ్వంభరలో బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు టాక్ వచ్చింది.
కానీ, ఫైనల్‌గా ఆషికా రంగనాథ్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. విశ్వంభర సినిమా వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, విశ్వంభర సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. ఇదివరకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి షేర్ చేసిన విషయం తెలిసిందే. జిమ్ ఎక్సర్‌సైజ్‌లు విశ్వంభర కోసమే అంటూ క్యాప్షన్ రాసుకొచ్చి మరి మెగాస్టార్ షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
కాగా విశ్వంభర చిత్రంలో హనుమాన్ పాత్ర కీలకంగా ఉండనుందని ఆ మధ్య విడుదలైన టైటిల్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా మూడు లోకాలకు సంబంధించినదిగా గ్లింప్స్‌లో తెలిపారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపిస్తారని కూడా ఓ ప్రచారం నడుస్తోంది.
టాపిక్