Vishwambhara: ఆమె సంపత్ గారి లక్కీ హీరోయిన్, తీసినవన్నీ సూపర్ హిట్లు.. విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్-chiranjeevi vishwambhara director vassishta says sampath nandi luckiest heroine tamanna in odela 2 pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwambhara: ఆమె సంపత్ గారి లక్కీ హీరోయిన్, తీసినవన్నీ సూపర్ హిట్లు.. విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్

Vishwambhara: ఆమె సంపత్ గారి లక్కీ హీరోయిన్, తీసినవన్నీ సూపర్ హిట్లు.. విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Vishwambhara Director Vassishta On Sampath Nandi Tamanna: చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ వశిష్ట ఇటీవల తమన్నా నటించిన ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిల్లో ఒకరిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది, తమన్నాపై దర్శకుడు వశిష్ట ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆమె సంపత్ గారి లక్కీ హీరోయిన్, తీసినవన్నీ సూపర్ హిట్లు.. విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్

Vishwambhara Director Vassishta On Sampath Nandi Tamanna: హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్‌గా మారారు వశిష్ట. నందమూరి కల్యాణ్ రామ్‌తో తెరకెక్కించిన బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వశిష్ట దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

చిరంజీవి మైథలాజికల్ ఫాంటసీ

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మైథలాజికల్ ఫాంటసీ జోనర్‌‌లో విశ్వంభర మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వశిష్ట. అయితే, ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఓదెల 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో శర్వానంద్‌తోపాటు డైరెక్టర్ వశిష్ట ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విశ్వంభర దర్శకుడి కామెంట్స్

ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సూపర్ విజన్ అందించిన డైరెక్టర్ సంపత్ నంది, హీరోయిన్ తమన్నాపై విశ్వంభర దర్శకుడు వశిష్ట ఆసక్తికర కామెంట్సే చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. దర్శకుడు సంపత్ నంది గారి ప్రొడక్షన్ అదిరిపోయింది. సంపత్ గారి లక్కీయెస్ట్ హీరోయిన్ తమన్నా గారు. ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాలు సంపత్ గారు తమన్నా గారితో చేశారు. అన్ని సూపర్ హిట్లు. ఈ సినిమా కూడా అంతకుమించి సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నాగ సాధువుగా తమన్నా

"నాగ సాధువుగా తమన్నా గారిని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ చాలా బాగుంది . తమన్నా గారి పర్ఫార్మెన్స్ చాలా మ్యాసీవ్‌గా ఉంది. ఏప్రిల్ 17న థియేటర్స్ అన్ని శివశక్తిమయం కావాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ వశిష్ట ఆకాంక్షించారు.

అందరూ గర్వపడే సినిమా

ఇదే ఈవెంట్‌లో ఓదెల 2లో విలన్‌గా చేసిన యాక్టర్ వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది అందరూ గర్వపడే సినిమా. చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ప్రొడ్యూసర్ మధుగారు చాలా పాషన్ ఉన్న నిర్మాత. హోంబలే ప్రొడక్షన్స్‌లా మధు క్రియేషన్స్ కూడా చాలా పెద్ద బ్యానర్ కాబోతుంది" అని అన్నాడు.

ఇది నాకు ఒక ఫ్యామిలీ

"ఈ టీం అంటే నాకు ఒక ఫ్యామిలీ. ఇలాంటి ఫీలింగ్ నాకు. సంపత్ నంది గారి రైటింగ్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇది మరో లెవల్‌లో ఉండబోతుంది. అంత అద్భుతమైన రైటింగ్ ఇందులో ఉంది. ఈ సినిమా అందరిని గొప్పగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది" అని నటుడు వశిష్ట ఎన్ సింహా తెలిపాడు.

మరో లెవెల్‌లో తమన్నా నటన

"ఈ సినిమాకి పవర్ హౌస్ తమన్నా గారు. తమన్నా గారితో యాక్ట్ చేసిన ప్రతి మూమెంట్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో తమన్నా గారి పర్ఫామెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుంది" అని గొప్పగా చెప్పుకొచ్చాడు యాక్టర్ వశిష్ట ఎన్ సింహా.

తమన్నా-సంపత్ నంది సినిమాలు

ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 17) థియేటర్లలో తమన్నా మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ ఓదెల 2 రిలీజ్ అయింది. ఇక దర్శకుడు సంపత్ నంది, హీరోయిన్ కాంబినేషన్‌లో రచ్చ, బెంగాల్ టైగర్, సిటీ మార్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు సంపత్ నంది సూపర్ విజన్‌లో ఓదెల 2లో కూడా తమన్నా ప్రధాన పాత్ర పోషించింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం