Chiranjeevi: కొడుకు కోసం చిరంజీవిని దించుతున్న సుమ కనకాల.. యాంకర్ స్కెచ్ అదుర్స్ కదూ!
Chiranjeevi Suma Kanakala: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల తన కొడుకు రోషన్ కనకాల కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించుతున్నారు. దీంతో యాంకర్ సుమ స్కెచ్ అదిరిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Chiranjeevi Bubble Gum: బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నారు సుమ. ఎంతోకాలంగా యాంకర్‌గా వెలుగొందుతున్న సుమ తన కొడుకు రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. రోషన్ కనకాల హీరోగా చేస్తున్న తొలి చిత్రం బబుల్ గమ్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా మానస చౌదరి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

బబుల్ గమ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోంది. బబుల్ గమ్ మూవీ డిసెంబర్ 29న విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగానే సాంగ్స్ విడుదల చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన బబుల్ గమ్ సినిమా ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ పాట ఇదివరకే వైరల్ అయింది. ఇప్పుడు రెండో సాంగ్‌ను విడుదల చేస్తున్నారు మేకర్స్.
బబుల్ గమ్ సెకండ్ సింగల్ ఇజ్జత్ పాట కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపుతున్నారు యాంకర్ సమ కనకాల. నవంబర్ 23న ఇజ్జత్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రోషన్ కనకలా స్టన్నింగ్ లుక్‌తో అట్రాక్ట్ చేయగా.. చిరంజీవి సాంగ్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయం తెలిసి కొడుకు రోషన్ సినిమా ప్రచారం కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపి యాంకర్ సుమ మాస్టర్ స్కెచ్ వేసిందిగా అని పలువురు భావిస్తున్నారు. చిరంజీవి ప్రచారంతో రోషన్ కనకాల సినిమా బబుల్ గమ్‌కు మంచి ప్రమోషన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బబుల్ గమ్ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు హర్ష చెముడు (వైవా హర్ష), కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమోళి తదితరులు నటిస్తున్నారు.