Boss Party lyrical Song: బాస్ వచ్చిండు.. పార్టీ సాంగ్‌తో దుమ్మురేపిండు.. మాస్‌కు కిక్ ఎక్కించిండు -chiranjeevi stareed waltair veerayya first single boss party lyrical video released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Stareed Waltair Veerayya First Single Boss Party Lyrical Video Released

Boss Party lyrical Song: బాస్ వచ్చిండు.. పార్టీ సాంగ్‌తో దుమ్మురేపిండు.. మాస్‌కు కిక్ ఎక్కించిండు

Maragani Govardhan HT Telugu
Nov 23, 2022 05:10 PM IST

Boss Party lyrical Song: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట దుమ్మురేపింది.

బాస్ పార్టీ సాంగ్ విడుదల
బాస్ పార్టీ సాంగ్ విడుదల

Boss Party lyrical Song: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు.. త్వరలో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. అయితే ఈ సారి వాల్తేరు వీరయ్యతో మంచి మాస్ బోనాంజాను ఆడియెన్స్‌కు ఇవ్వనున్నారు. ఆచార్య పరాజయం చెందినప్పటికీ ఈ ఏడాది గాడ్‌ఫాదర్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ విడుదల కాగా.. తాజాగా ఫస్ట్ పాటను విడుదల చేశారు.

బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట దుమ్మురేగేలా ఉంది. బాస్ వస్తుండు.. అంటూ దేవిశ్రీ ప్రసాద్ గళంలో మాస్ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇందుకు మెగాస్టార్ లుంగీలో వేసిన మాస్ స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంది. ఊర్విశీ రౌటేలా అందాలు ఈ పాటకు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి బాస్ పార్టీ సాంగ్‌కు డ్యాన్స్‌తో ఓ రేంజ్‌లో ఇచ్చిపడేశారు. దేవిశ్రీ డీజే సౌండ్‌కు అలరించేలా ఉంది.

మెగాస్టార్ లాంటి మాస్ హీరోకు సరైన పాట పడిందని విడుదల కాక ముందే ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను నకాశ్ అజీజ్, డీఎస్‌పీ, హరిప్రియ ఆలపించారు. స్వరాలే కాకుండా ఈ సాంగ్‌కు సాహిత్యాన్ని కూడా దేవిశ్రీనే అందించడం మరో విశేషం. పక్క మాస్ సింగిల్‌గా రానున్న ఈ పాట సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేథరిన్ తెరీసా మరో హీరోయిన్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.