Chiranjeevi Allu Arjun: మెగా అభినందన - అల్లు అర్జున్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్ - ఫొటోలు వైరల్
Chiranjeevi Allu Arjun: పుష్ప సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. బన్నీని చిరు సత్కరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Chiranjeevi Allu Arjun: పుష్ప సినిమాకుగాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు హీరోగా చరిత్రను సృష్టించాడు. నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీ ప్రముఖులు అతడిని అభినందిస్తోన్నారు.
నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్‌ను చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. ఫ్లవర్ బొకే ఇచ్చి బన్నీకి అభినందనలు చెప్పారు చిరంజీవి. అంతే కాకుండా అల్లు అర్జున్‌కు స్వయంగా చిరంజీవి స్వీట్స్ తినిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మెగా అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
రామ్‌చరణ్ స్పెషల్ గిఫ్ట్…
నేషనల్ అవార్డ్ సాధించిన అల్లు అర్జున్‌కు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్ గిఫ్ట్‌ను అందజేశారు. రామ్‌చరణ్ పంపించిన గిఫ్ట్ ఫొటోను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
గిఫ్ట్‌తో పాటు స్పెషల్ నోట్‌ను కూడా బన్నీకి అందజేశాడు చరణ్. డియర్ బన్నీ నీకు నేషనల్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులను నువ్వు మరెన్నో సాధిస్తావనే నమ్మకముంది అంటూ ఇందులో రామ్‌చరణ్, ఉపాసన పేర్కొన్నారు. బన్నీ షేర్ చేసిన ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
పుష్ప సీక్వెల్...
బన్నీ నేషనల్ అవార్డ్ సాధించడంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. వచ్చే ఏడాది మార్చిలో పుష్ప ది రూల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనుంది.
టాపిక్