Chiranjeevi: సినిమాలు ఆడకపోతే ఫిల్మ్ మేకర్స్‌దే త‌ప్పు - ప్రేక్ష‌కుల‌ది కాదు - చిరంజీవి కామెంట్స్ వైర‌ల్‌-chiranjeevi sensational comments on ott impact on theaters in tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: సినిమాలు ఆడకపోతే ఫిల్మ్ మేకర్స్‌దే త‌ప్పు - ప్రేక్ష‌కుల‌ది కాదు - చిరంజీవి కామెంట్స్ వైర‌ల్‌

Chiranjeevi: సినిమాలు ఆడకపోతే ఫిల్మ్ మేకర్స్‌దే త‌ప్పు - ప్రేక్ష‌కుల‌ది కాదు - చిరంజీవి కామెంట్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 13, 2024 11:06 AM IST

Chiranjeevi: పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు ఆడిన‌ప్పుడే ఇండ‌స్ట్రీ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. కంటెంట్ బాగుంటే సినిమాల‌ను తెలుగు ఆడియెన్స్ హిట్ చేస్తార‌ని ఈ ఏడాది రిలీజైన ప‌లు చిన్న చిత్రాలు రుజువు చేశాయ‌ని చిరంజీవి అన్నాడు. చిరంజీవి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

చిరంజీవి
చిరంజీవి

ఓటీటీల‌కు అల‌వాటుప‌డ్డ ప్రేక్ష‌కులు సినిమాలు చూసేందుకు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌న్న‌ది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని చిరంజీవి చెప్పాడు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని దీపావ‌ళికి విడుద‌లైన అమ‌ర‌న్‌, ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు క సినిమాలు రుజువు చేశాయ‌ని చిరంజీవి అన్నారు. స‌త్య‌దేవ్‌, డాలీ ధ‌నుంజ‌య్ హీరోలుగా న‌టిస్తోన్న జీబ్రా మూవీ ట్రైల‌ర్‌ను చిరంజీవి మంగ‌ళ‌వారం రిలీజ్ చేశాడు.

కొవిడ్ టైమ్ లో…

ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ “కోవిడ్ సమయంలో ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియెన్స్ చూస్తార‌నే సంశ‌యాలు, సందేహాలు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మొద‌ల‌య్యాయి. ఇండ‌స్ట్రీ భ‌విష్య‌త్తు ఏమైపోతుంద‌నే డోలాయ‌మాన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. జనాలు ఓటీటీలో సినిమాలు చూడటానికి అల‌వాటు ప‌డ్డారు. అన్ని భాష‌ల సినిమాలు చూడ‌టం మొద‌లుపెట్టారు. దాంతో పెద్ద సినిమాలు ,హై బ‌డ్జెట్ చూసేందుకు తప్పితే చిన్న సినిమాల‌ను చూసేందుకు ప్రేక్ష‌కుల‌ను థియేటర్స్ కి రప్పించడం చాలా కష్టమనే అభిప్రాయం మొద‌లైంది” అని తెలిపారు.

అన్ని సినిమాలు ఆడాలి....

“ఐదారు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది ఇండస్ట్రీ కాదు, చిన్న సినిమాలు కూడా ఆడాలి. చిన్న సినిమాలు ఆడితేనే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇండ‌స్ట్రీ స‌జావుగా సాగుతుంది ఓటీటీ ట్రెండ్ కార‌ణంగా ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌నే బెరుకు నాలో మొద‌లైంది. కానీ అవ‌న్నీ త‌ప్ప‌ని అర్థ‌మైంది. ఓ సినిమా ఆడ‌లేదంటే ప్రేక్ష‌కుల త‌ప్పు కాదు ఫిల్మ్ మేక‌ర్స్‌దే త‌ప్పు”అని చిరంజీవి చెప్పారు

చిన్న సినిమాలు నిరూపించాయి…

“ప్రశాంత్ వర్మ, తేజసజ్జా కలయికలో హనుమాన్ తో ఈ ఏడాది ఆరంభంలోనే టాలీవుడ్‌కు పెద్ద హిట్ ద‌క్కింద‌ని చిరంజీవి గుర్తుచేశారు. పాన్ ఇండియ‌న్ వైడ్‌గా పెద్ద విజయం సాధించింది. చిన్న సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు.

తర్వాత వచ్చిన కమిటీ కుర్రాళ్ళు, డీజే టిల్లు 3, ఆయ్ ఇలా వరుసగా సినిమాలో సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. మొన్న దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్ ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాల వెనుక‌ల పెద్ద యాక్ట‌ర్లు లేర్లు. కోట్ల బ‌డ్జెట్‌తో చేసిన సినిమాలు కావ‌వి. కంటెంట్ బాగుండ‌టంతోనే ఈ సినిమాలు విజ‌యాల్ని సాధించాయి” చిరంజీవి పేర్కొన్నారు

కంటెంట్ బాగుంటే...

చిరంజీవి మాట్లాడుతూ “కంటెంట్ బాగుండి.... సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటే సినిమాను హిట్ చేయ‌డానికి ప్రేక్ష‌కులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సినిమాలు ఆడవు ప్రేక్షకులు ఓటీటికి అలవాటు పడిపోయారనే మాట అవాస్తవం. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు.

సినిమాని వాళ్ళకి మెప్పించేలా మనం చాకచక్యంగా తీయాలి. కంటెంట్‌ను ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకున్న త‌ర్వాతే రిలీజ్ చేయాలి. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 125 సినిమాలు రిలీజైతే...ఇర‌వై శాతం వ‌ర‌కు సినిమాలు హిట్ట‌య్యాయి. ఈ హిట్టు సినిమాల జాబితాలో స‌త్య‌దేవ్ న‌టించిన జీబ్రా నిల‌వాల‌ని” అన్నాడు.జీబ్రా మూవీ న‌వంబ‌ర్ 22న రిలీజ్ కాబోతోంది.

విశ్వంభ‌ర మూవీ…

ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర మూవీ చేస్తోన్నాడు. సోషియో ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో ఆషికా రంగ‌నాథ్‌, మీనాక్షి చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Whats_app_banner