Chiranjeevi on Sridevi: శ్రీదేవితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తాను.. అతిలోకసుందరిపై మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Chiranjeevi on Sridevi: అతిలోకసుందరి, దివంగత శ్రీదేవితో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తను ఎంతో మంది హీరోయిన్లతో నటించినప్పటికీ శ్రీదేవితో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
Chiranjeevi on Sridevi: మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్ల పక్కన నటించారు. గొప్ప నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో మైలు రాళ్ల లాంటి సినిమాల్లో నటించి తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. అయితే ఆయన ఎంతమందితో నటించినప్పటికీ శ్రీదేవీ అంటే మాత్రం ఆయన హృదయంలో ప్రత్యేక స్థానముంటుందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఇటీవలే నిజం విత్ స్మిత అనే టాక్ షోకు హాజరైన మెగాస్టార్.. శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

శ్రీదేవితో కలిసి పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని చిరంజీవి తెలిపారు. ఆమెత వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను బాగా ఆస్వాదిస్తానని స్పష్టం చేశారు. తాను ఎంతమందితో పనిచేసినా శ్రీదేవితో పోటీ పడిచేస్తానని అన్నారు. శ్రీదేవితో కలిసి మన మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్‌పీ పరశురాం, మోసగాడు లాంటి తదితర చిత్రాల్లో నటించారు.
తన ఫెవరెట్ ఫిమేల్ యాక్టర్ ఎవరో కూడా తెలిపారు చిరంజీవి. తనతో పనిచేసిన హీరోయిన్ల అందరిలోనూ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని, ఒక్కొక్కరిలో ఒక్కోకటి నచ్చుతుందని స్పష్టం చేశారు. రాధిక అప్పటికప్పుడే స్పాంటెనిటీగా చేస్తుందని, రాధ డ్యాన్సింగ్ స్కిల్స్ బాగుంటాయని తెలిపారు. ఇక విజయశాంతి పాత్రలో తనను తాను మార్చుకునే సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు.
శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఆమెతో డ్యాన్స్ చేయడం మర్చిపోలేని అనుభూతి అని, ఆమెతో చేసినంతగా మరెవరితోనూ పనిచేయలేదని అన్నారు. అతిలోక సుందరితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది.
సంబంధిత కథనం
టాపిక్