Chiranjeevi Remuneration: భోళాశంకర్ డిజాస్టర్.. చిరంజీవికి రెమ్యునరేషన్ లేనట్లేనా? ఈ వార్తల్లో నిజమెంత?
Chiranjeevi Remuneration: భోళాశంకర్ డిజాస్టర్ తో చిరంజీవికి రెమ్యునరేషన్ లేనట్లేనా? ఈ విషయంలో నిర్మాతను చిరు ఇబ్బంది పెడుతున్నాడా? ఈ పుకార్లలో అసలు నిజమెంత?
Chiranjeevi Remuneration: భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీపై ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో చిరుకి అసలు రెమ్యునరేషనే లేదని ఒకరు, తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశాడని మరొకరు, తనకు పూర్తి రెమ్యునరేషన్ కావాల్సిందే అని ఇంకొకరు.. ఇలా ఎన్నో పుకార్లు వస్తున్నాయి.
మూడు రోజులు కలిపి కేవలం రూ.25 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన భోళా శంకర్.. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.55 కోట్ల దూరంలో ఉంది. ఇది అసాధ్యంగా కనిపిస్తుండటంతో నిర్మాత అనిల్ సుంకరకు మరో డిజాస్టర్ దక్కినట్లే. ఈ మధ్యే అఖిల్ తో తీసిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. దీంతో భోళా శంకర్ రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి, అనిల్ సుంకర మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అయితే వీటిపై నిర్మాత అనిల్ సుంకర స్పందించాడని, ఓ వాట్సాప్ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇదీ అని కూడా మరో వార్త బయటకు వచ్చింది. అందులో రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తాను చిరంజీవితో మరో సినిమా చేయబోతున్నానని సదరు నిర్మాత చెప్పినట్లు తెలిసింది. సినిమా ఫ్లాపవడం కంటే కూడా చిరు రెమ్యునరేషన్ విషయంలో నెలకొన్న గందరగోళమే అభిమానులను మరింత ఆవేదనకు గురి చేస్తోంది.
ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్యలాంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన చిరంజీవి.. భోళా శంకర్ తో హ్యాట్రిక్ కొడతాడనుకుంటే.. ఇలా అయ్యిందేంటని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. మరోవైపు చిరంజీవి త్వరలోనే మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడు. ఈ సర్జరీ తర్వాత మెగాస్టార్ 45 రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నాడు. అప్పటి వరకూ షూటింగ్ లకు దూరం కాబోతున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్