Chiranjeevi Waltair Veerayya Update: ఫ్యాన్స్‌కు చిరంజీవి, రవితేజ మాస్ ట్రీట్ - కలిసి స్టెప్పులేయబోతున్నారు
Chiranjeevi Waltair Veerayya Update: వాల్తేర్ వీరయ్య సినిమా కోసం చిరంజీవి, రవితేజల కలిసి ఓ పాటలో స్టెప్పులేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
Chiranjeevi Waltair Veerayya Update: అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి, హీరో రవితేజ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వాల్తేర్ వీరయ్య సినిమా రూపొందుతోంది. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. వైజాగ్ సముద్రప్రాంతం జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వాల్తేర్ వీరయ్య సినిమా రూపొందుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఇందులో రవితేజ పాత్ర కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. సినిమాలో అతడు దాదాపు నలభై ఐదు నిమిషాలపైనే కనిపిస్తాడని అంటున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి, రవితేజపై ఓ మాస్ సాంగ్ ఉంటుందని చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ పాట షూటింగ్‌ను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసినట్లు తెలిపారు. ఈ మాస్ సాంగ్‌లో చిరు, రవితేజ స్టెప్పులు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు.
చిరంజీవి, రవితేజ ఇమేజ్‌కు తగినట్లుగా దేవిశ్రీప్రసాద్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేసినట్లు పేర్కొన్నారు. వైజాగ్‌లోని జాలరీపేట అనే ఫిక్షనల్ విలేజ్ నేపథ్యంలో దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళి సందర్భంగా ఇటీవల ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.