Chiranjeevi Ramcharan Meets Amit Shah: భారతీయ చిత్రసీమలోని ఇద్దరు దిగ్గజాలు అయిన చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని అన్నాడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. శుక్రవారం అమిత్‌షాను ఆయన ఇంటిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్‌చరణ్ కలిశారు.,ఈ సందర్భంగా భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను తెలుగు సినిమా పరిశ్రమ గణనీయంగా ప్రభావితం చేస్తున్నదని అమిత్‌షా కొనియాడారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో పాటు ఆర్ఆర్ ర్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు రామ్‌చరణ్‌కు అమిత్‌షా అభినందనలు తెలియజేశారు.,ఇద్దరు దిగ్గజాలు అయిన చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని అమిత్‌షా ట్వీట్ చేశారు. చరణ్‌ను శాలువాతో సత్కరించారు. అమిత్‌షాను చిరంజీవి, చరణ్ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అమిత్‌షా ఆత్మీయ సత్కారంపై చిరు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ కార్యక్రమంలో తాను భాగం కావడం థ్రిల్లింగ్‌గా అనిపించిందని చిరంజీవి ట్వీట్ చేశాడు.,ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ గెలిచిన తొలి తెలుగు సినిమాగా చరిత్రను తిరగరాసింది., ,