Chiranjeevi God Father Tamil Release Date: కోలీవుడ్‌లో చిరు సంద‌డి - గాడ్‌ఫాద‌ర్ త‌మిళ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌-chiranjeevi godfather to hit the screens in tamil on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Godfather To Hit The Screens In Tamil On This Date

Chiranjeevi God Father Tamil Release Date: కోలీవుడ్‌లో చిరు సంద‌డి - గాడ్‌ఫాద‌ర్ త‌మిళ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 13, 2022 06:48 AM IST

Chiranjeevi God Father Tamil Release Date:చిరంజీవి హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ సినిమా వారం రోజుల్లోనే 150 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమా త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. విడుద‌ల తేదీ ఏదంటే...

చిరంజీవి
చిరంజీవి

Chiranjeevi God Father Tamil Release Date: టాలీవుడ్‌లో ఈ ద‌స‌రా విన్న‌ర్‌గా చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాద‌ర్ నిలిచింది. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన గాడ్‌ఫాద‌ర్ రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంటోంది. వారం రోజుల్లోనే 150 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా గాడ్‌ఫాద‌ర్ నిలిచింది.

ఆచార్య ప‌రాజ‌యం త‌ర్వాత త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఈ స‌క్సెస్‌తోచిరంజీవి బ‌దులు ఇచ్చాడు. తెలుగుతో పాటు హిందీలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు గాడ్‌ఫాద‌ర్ లాభాల‌ను మిగిల్చింది.

తెలుగు, హిందీ భాష‌ల్లో ద‌స‌రా రోజున ఈ సినిమా రిలీజైంది. త‌మిళంలో మాత్రం వారం ఆల‌స్యంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అక్టోబ‌ర్ 14న (శుక్ర‌వారం) గాడ్‌ఫాద‌ర్ త‌మిళ్ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

తెలుగు, హిందీతో పాటుగా త‌మిళంలోనూ ద‌స‌రా రోజున గాడ్‌ఫాద‌ర్ సినిమాను రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారు. కానీ త‌మిళ్ వెర్ష‌న్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆల‌స్యం కావ‌డంతో వారం రోజులు వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం.

త‌మిళంలో న‌య‌న‌తార‌తో పాటు ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజాకు ఉన్న క్రేజ్ గాడ్‌ఫాద‌ర్‌కు క‌లిసివ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. . త‌నిఒరువ‌న్‌తో పాటు మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు త‌మిళ సినిమాలు పెద్ద విజ‌యాల్ని అందుకున్నాయి. మ‌రోవైపు న‌య‌న‌తార కూడా వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న‌ది.

ఈ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌య‌న‌తార (Nayanthara) న‌టించింది. ఆమె భ‌ర్త‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో స‌త్య‌దేవ్ న‌టించాడు. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర‌ను పోషించాడు. మ‌ల‌యాళం చిత్రం లూసిఫ‌ర్ ఆధారంగా గాడ్‌ఫాద‌ర్ సినిమా రూపొందింది.

WhatsApp channel