Godfather Day 1 Collection: గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో లోయెస్ట్‌-chiranjeevi godfather first day worldwide box office collection details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Godfather First Day Worldwide Box Office Collection Details

Godfather Day 1 Collection: గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో లోయెస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 06, 2022 10:44 AM IST

Godfather Day 1 Collection: చిరంజీవి హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ద‌స‌రా రోజున రిలీజైన ఈ సినిమాకు మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా గాడ్‌ఫాద‌ర్ సినిమాకు మొద‌టిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

చిరంజీవి
చిరంజీవి (Twitter)

Godfather Day 1 Collection: చిరంజీవి(Chiranjeevi) హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మెగా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. చిరంజీవి యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్, హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌ల‌యాళ వెర్ష‌న్‌తో పోలిస్తే తెలుగులో కొన్ని మార్పులు చేస్తూ చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా గాడ్‌ఫాద‌ర్ సినిమాను తెర‌కెక్కించాడు. అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ల‌భించ‌డంతో తొలిరోజు చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది.

బుధ‌వారం నాడు ఏపీ తెలంగాణ‌లో ఈ సినిమా 22 కోట్ల గ్రాస్‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 38 కోట్ల గ్రాస్‌, 17.50 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

నైజాం ఏరియాలో మొద‌టిరోజు ఈ సినిమాకు మూడున్న‌ర కోట్ల షేర్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. సీడెడ్‌లో 3.20 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 1.30 కోట్లు, ఈస్ట్ గోదావ‌రిలో కోటి అర‌వై ల‌క్ష‌లు, వెస్ట్ గోదావ‌రిలో 65 ల‌క్ష‌లు, గుంటూర్‌లో కోటి ఎన‌భై ల‌క్ష‌లు, కృష్ణ ఏరియాలో 75 ల‌క్ష‌లు షేర్‌ను గాఢ్ ఫాద‌ర్ సినిమా రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. నెల్లూరులో ఈ సినిమా యాభై ల‌క్ష‌ల షేర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది.

మొత్తంగా ఏపీ, తెలంగాణ‌లో మొద‌టి రోజు ఈ సినిమా 22 కోట్ల గ్రాస్‌ను, 13 కోట్ల షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 38 కోట్ల గ్రాస్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన త‌ర్వాత ఆచార్య‌, సైరా న‌ర‌సింహారెడ్డి, ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలు చేశారు. వాటి కంటే గాడ్‌ఫాద‌ర్ సినిమాకు తొలిరోజు త‌క్కువ క‌లెక్ష‌న్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా గాడ్‌ఫాద‌ర్ సినిమాను తెర‌కెక్కించాడు. గాడ్‌ఫాద‌ర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించాడు. క్లైమాక్స్‌లో చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ క‌లిసి న‌టించిన యాక్ష‌న్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. విల‌న్‌గా స‌త్య‌దేవ్ న‌టించ‌గా న‌య‌న‌తార కీల‌క పాత్ర‌ను పోషించింది. బిగ్‌బాస్ దివితో పాటు అన‌సూయ‌, సునీల్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.

IPL_Entry_Point