God Father Pre Release Business: గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ బిజినెస్ - ఆచార్య కంటే త‌క్కువే-chiranjeevi god father pre release business area wise details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi God Father Pre Release Business Area Wise Details

God Father Pre Release Business: గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ బిజినెస్ - ఆచార్య కంటే త‌క్కువే

Nelki Naresh Kumar HT Telugu
Oct 03, 2022 01:52 PM IST

God Father Pre Release Business: చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందంటే

గాడ్ ఫాద‌ర్
గాడ్ ఫాద‌ర్ (Twitter)

God Father Pre Release Business: గాడ్‌ఫాద‌ర్ సినిమాతో ద‌స‌రాకు అభిమానుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో చిరంజీవికి ద‌ళ‌ప‌తిలా నిలిచే యాక్ష‌న్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్(Salman khan) క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాతోనే స‌ల్మాన్‌ఖాన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.

చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. కాగా గాడ్‌ఫాద‌ర్ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు స‌మాచారం. నైజాంలో 23 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ 73 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం.

నైజాంలో 23 కోట్లు, ఆంధ్రాలో 37 కోట్లు, సీడెడ్‌లో 14 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలిసింది. క‌ర్ణాట‌కలో ఆరు కోట్లు, హిందీలో ఏడు కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో 7.50 కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి న‌టించిన గ‌త చిత్రం ఆచార్య 130 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయ‌గా సైరా న‌ర‌సింహారెడ్డి 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వాటితో పోలిస్తే గాడ్‌ఫాద‌ర్ థియేట్రిక‌ల్ బిజినెస్ త‌క్కువ‌ కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా ఆధారంగా గాడ్‌ఫాద‌ర్ సినిమా రూపొందుతోంది. న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

IPL_Entry_Point