Chiranjeevi on Kalki 2898 AD: నా ఫేవరెట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై చిరంజీవి ట్వీట్-chiranjeevi congratulates his favorite producer ashwini dutt on kalki 2898 ad success ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi On Kalki 2898 Ad: నా ఫేవరెట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై చిరంజీవి ట్వీట్

Chiranjeevi on Kalki 2898 AD: నా ఫేవరెట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై చిరంజీవి ట్వీట్

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 08:02 PM IST

Chiranjeevi on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీకి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ వస్తుండటంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ కు శుభాకాంక్షలు అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నా ఫేవరెట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై చిరంజీవి ట్వీట్
నా ఫేవరెట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై చిరంజీవి ట్వీట్

Chiranjeevi on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ టాక్ సంపాదించడంపై చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ ను అతడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ట్వీట్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ మొత్తానికి చిరు శుభాకాంక్షలు చెప్పాడు.

కల్కి 2898 ఏడీపై చిరు ఏమన్నాడంటే..

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రేక్షకులకు తెగ నచ్చేసినట్లు తొలి రోజే సోషల్ మీడియా పోస్టులు, రివ్యూలు చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమాను పలువురు సెలబ్రిటీలు కూడా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా చిరంజీవి కూడా దీనిపై స్పందించాడు. అతడు ఈ సినిమా చూడకపోయినా.. అందరి పొగడ్తలు వింటుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.

"కల్కి 2898 ఏడీ గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో ఇలాంటి మైథలాజికల్ సై ఫి ఫ్యూచరిస్టిక్ సినిమా తీసిన నాగ్ అశ్విన్ క్రియేటివ్ జీనియస్ కు అభినందనలు. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ గారికి, ఎంతో అభిరుచి కలిగిన, ధైర్యవంతులైన స్వప్న దత్, ప్రియాంకా దత్, ఈ ఘనత సాధించిన మొత్తం టీమ్ కు నా శుభాకాంక్షలు. ఇలా కలలు కంటూనే ఉండండి. ఇండియన్ సినిమా పతాకాన్ని మరింత పైకి ఎగరేస్తూనే ఉండండి" అని చిరంజీవి ట్వీట్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో మరుపురాని సినిమాలు వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే నిర్మితమయ్యాయి. మొదట 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చిరు కెరీర్లో ఓ ఆల్ టైమ్ హిట్. ఆ తర్వాత కూడా చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవలాంటి సూపర్ హిట్ సినిమాలు చిరు, వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చాయి.

కల్కి 2898 ఏడీ మూవీ గురించి..

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తొలి రోజే రూ.200 కోట్ల ఓపెనింగ్ ఖాయమని భావిస్తుండగా.. ఈ పాజిటివ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ రికార్డులు కూడా బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నట్లు ఇది మరో రూ.1000 కోట్ల సినిమా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కంటే కూడా అమితాబ్, కమల్ హాసన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. మూడు గంటల సినిమాలో ప్రభాస్ పాత్ర గంటలోపు సమయానికే పరిమితం కావడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసినా.. ఓవరాల్ గా సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం మాత్రం వాళ్లను ఆనందానికి గురి చేస్తోంది.

Whats_app_banner