Chiranjeevi: విశ్వక్ సేన్ ఆడపిల్ల అయుంటే గుండెజారి గల్లంతయ్యేది.. కసక్‌లా ఉన్నాడు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
Chiranjeevi On Vishwak Sen Lady Getup In Laila Pre Release Event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ లేడి గెటప్‌పై చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi On Vishwak Sen In Laila Pre Release Event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పాడు.
చిరంజీవి కామెంట్స్
ఇదిలా ఉంటే, విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు విశ్వక్ సేన్‌పై చేసిన చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లైలా మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇలాంటి ఈవెంట్స్‌కి రావడం వల్ల ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంత ఎనర్జీ ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు"అని స్పీచ్ స్టార్ట్ చేశారు.
రామ్ చరణ్‌కి సూర్య అంటే ఇష్టం
"విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్లకూడదు? అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు అని అన్నారు. అంటే, మనుషులంటే వేరే వాళ్ల మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? మా ఇంట్లోనే మా అబ్బాయి (రామ్ చరణ్)కి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్‌కి నేను వెళ్లకూడదా?" అని చిరంజీవి మాట్లాడారు.
ఒకరినొకరు కొట్టుకునేవాళ్లు
"విశ్వక్‌కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది. కానీ, సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను. అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నెల్లూరులో మా కజిన్స్ ఒకరు రామరావు గారిని, ఒకరు ఏఎన్ఆర్ గారిని అభిమానించి ఒకరిని ఒకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే ఉంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే నాకు మొదలైయింది" అని చిరంజీవి తెలిపారు.
"నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సక్యత సహ్రుద్బావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్‌లో హనీ హౌజ్‌లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్లం. ఈ రోజుకి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా కలసికట్టుగా ఉంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా ఉండాలి" అని చిరంజీవి అన్నారు.
ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్
"పుష్ప 2 పెద్ద హిట్ అయింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్లుబికింది. లైలా గెటప్‌లో విశ్వక్ కసక్‌లా అనిపిస్తున్నాడు (నవ్వుతూ). విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయివుంటే గుండెజారి గల్లంతయ్యేది (నవ్వుతూ). అంత గ్లామర్‌గా ఉన్నాడు" అని చిరంజీవి సరదాగా ఫన్నీ కామెంట్స్ చేశారు.
సంబంధిత కథనం