మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తెలుగు ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభరకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా చేయగా కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించాడు.
ఈ సినిమా మొదట 2025 జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. 2026 సమ్మర్‌కు విశ్వంభర సినిమాను విడుదల చేయనున్నట్లు చిరంజీవి ఆ వీడియో తెలిపారు. విశ్వంభర ఆలస్యం, గ్రాఫిక్స్ వంటి గురించి చెప్పిన చిరంజీవి ఇవాళ (ఆగస్ట్ 21) సాయంత్రం మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మెగాస్టార్.
"నేను మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. ఈ సినిమాపై ఎందరికో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. విశ్వంభర ఎందుకు లేట్ అవుతుందని అడుగుతున్నారు. కానీ, విశ్వంభర ఆలస్యం కావడం సముచితమే. ఎందుకంటే విశ్వంభర సెకండాఫ్ అంతా గ్రాఫిక్స్‌తోనే నిండి ఉంటుంది" అని చిరంజీవి అన్నారు.
"ఆ గ్రాఫిక్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో మీకు అందించడానికే విశ్వంభర ఆలస్యం అవుతుంది. అప్పటివరకు మీకోసం నా పుట్టినరోజు సందర్భంగా అంటే ఇంకొన్ని గంటల్లో విశ్వంభర్ స్పెషల్ గ్లింప్స్ వస్తుంది. ఇవాళ (ఆగస్ట్ 21) సాయంత్రం 6:06 గంటలకు విశ్వంభర్ టీజర్ వస్తుంది" అని చిరంజీవి తెలిపారు.
"ఆ గ్లింప్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. అది సరే కానీ విశ్వంభర రిలీజ్ డేట్ చెప్పట్లేదు అనుకుంటున్నారా. అది కూడా నేను లీక్ చేసేస్తున్నాను. పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలు కూడా చూసేలా 20, 2026 దసరాకు విశ్వంభరను మీరు థియేటర్లలో కచ్చితంగా చూస్తారు" అని చిరంజీవి వెల్లడించారు.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాగే, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రిలీజ్ అయ్యే విశ్వంభర గ్లింప్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం