రంగంలోకి మెగాస్టార్.. అనిల్ తో మూవీపై క్రేజీ అప్ డేట్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్!-chiranjeevi anil ravipudi movie likely to start shooting on may 22 latest update telugu movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రంగంలోకి మెగాస్టార్.. అనిల్ తో మూవీపై క్రేజీ అప్ డేట్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్!

రంగంలోకి మెగాస్టార్.. అనిల్ తో మూవీపై క్రేజీ అప్ డేట్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్!

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న మూవీపై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి, అనిల్ రావిపూడి (x/KChiruTweets)

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు చేయబోతున్న లేటెస్ట్ మూవీ నుంచి కొత్త అప్ డేట్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఈ నెలలోనే చిరు రంగంలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆ డేట్ నుంచే

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్గార్ చిరంజీవి కొత్త సినిమా ‘మెగా 157’ షూటింగ్ మే 22 నుంచి స్టార్ట్ కాబోతుందని సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనిల్-చిరు కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ మూవీని ఈ ఏడాది ఉగాది రోజు (మార్చి 30) లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఓ సాంగ్ షూట్

చిరంజీవి ప్రస్తుతం యూకే టూర్ లో ఉన్నారు. ఆ టూర్ నుంచి స్వదేశం చేరుకోగానే అనిల్ రావిపూడి సినిమాపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. షూటింగ్ కోసం ఈ మూవీ యూనిట్ తో చిరు రాగానే మీటింగ్ పెడతారని తెలిసింది. కొత్త సినిమా షూటింగ్ కోసం చిరు గెటప్ ఛేంజ్ చేస్తారనే టాక్ ఉంది. అందుకు సంబంధించిన కసరత్తులు జరగబోతున్నాయి.

అన్ని ఏర్పాట్లు చేసుకుని మే 22 న షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలిసింది. ఫస్ట్ షెడ్యూల్ లో ఓ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారని టాక్. అలాగే కొన్ని కీలక సీన్స్ ను చిత్రీకరించబోతున్నారని సమాచారం.

ఫుల్ ఎంటర్ టైనర్

అనిల్ రావిపూడి సినిమాలంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కమర్షియల్ సినిమాలను ఆడియన్స్ కు నచ్చేలా తీయడంలో ఆయన దిట్ట. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు చిరంజీవితో సినిమాను కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా రెడీ చేయబోతున్నారు.

అనిల్ రావిపూడి ఎంత స్పీడ్ గా సినిమా కంప్లీట్ చేస్తారో తెలిసిందే. ఇప్పుడు ఈ ‘మెగా 157’ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసే అవకాశముంది. ఈ మూవీలో నయనతార, కేథరిన్ హీరోయిన్లు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్.

రెడీ అవుతున్న ఆ మూవీ

మరోవైపు చిరు లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి హనుమాన్ జయంతికి ‘రామ రామ’ రిలీజ్ అయిన సాంగ్ మూవీపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది. ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం