ఓటీటీలో ఎప్పటికప్పుడు తెలుగులో కూడా సరికొత్త కంటెంట్స్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అన్ని భాషలతో పోటీ పడుతూ తెలుగులో కూడా విభిన్నమైన కంటెంట్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతుంటాయి.
అలా సరికొత్తగా తెలుగులో ఓటీటీలోకి రానున్న మైథలాజికల్ కామెడీ థ్రిల్లర్ సినిమా చిరంజీవ. ఈ సినిమా గురించి ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. తాజాగా చిరంజీవ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోకు ఎదుటి మనుషుల ఆయుష్షు చూసే పవర్ లభిస్తుంది. దాంతో ఎదుటి వాళ్లు ఎన్నేళ్లు బతుకుతారో చెప్పగలడు.
అయితే, ఈ పవర్ ధన త్రయోదశి నాడు యమ ధర్మరాజుకు పూజ చేయడంతో లభించినట్లు హీరో తల్లి మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ చేయగా.. హీరోయిన్‌గా సోషల్ మీడియా బ్యూటీ కుషిత కల్లపు చేసింది. తొలిసారిగా రాజ్ తరుణ్, కుషిత జోడీ కట్టిన సినిమా చిరంజీవి.
స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీ సినిమా చిరంజీవకు అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విజయదశమి పర్వదినం సందర్భంగా చిరంజీవ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
చిరంజీవ మూవీ టీజర్ ఎంటర్‌టైన్‌మెంట్, లవ్, యాక్షన్‌తో ఆకట్టుకుంది. శివ (రాజ్ తరుణ్)కు చిన్నప్పటి నుంచే స్పీడు ఎక్కువ. సైకిల్‌ను కూడా జెట్ స్పీడ్‌తో నడుపుతుంటాడు. అతని వేగాన్ని చూసినవారు ఆంబులెన్స్ డ్రైవర్‌గా చేరమని సలహా ఇస్తారు.
అలా అంబులెన్స్ డ్రైవర్‌గా హీరో రాజ్ తరుణ్ చేస్తాడు. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఒక అందమైన అమ్మాయి (కుషిత కల్లపు)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివ కొన్ని పరిస్థితుల వల్ల సత్తు పైల్వాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్‌ను నేను లేపేస్తా అని మాటిస్తాడు శివ.
శివ తీసుకున్న మిషన్ అసాసిన్ ఏంటి అనేది టీజర్‌లో ఆసక్తి కలిగించింది. అలాగే, శివన తల్లి యమ ధర్మరాజుకు పూజ చేయమనడం, శివ అంబులెన్స్ నడుపుతుండగా యమ ధర్మరాజు వాహనం దున్నపోతు అడ్డం రావడం, శివకు ఎదుటి వారి ఆయుష్షు చెప్పే పవర్ రావడం అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా చిరంజీవ టీజర్ సాగింది.
సంబంధిత కథనం
టాపిక్