Vishwambhara: డైలమాలో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్.. కారణం ఇదే!-chirajeevi vishwambhara release in dilemma due to no ott deal yet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwambhara: డైలమాలో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్.. కారణం ఇదే!

Vishwambhara: డైలమాలో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్.. కారణం ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2025 11:47 AM IST

Vishwambhara: విశ్వంభర సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన చిత్రం వాయిదా పడింది. మూవీ టీమ్ తేదీ కోసం చూస్తున్నా.. ఓ కారణం వల్ల రిలీజ్ డైలమాలో పడిందని తెలుస్తోంది. ఎందుకంటే..

Vishwambhara: డైలమాలో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్.. కారణం ఇదే!
Vishwambhara: డైలమాలో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్.. కారణం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. అంజి తర్వాత చిరూ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ ఇదే కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం వాయిదా పడింది. అయితే, కొత్త డేట్ ఫిక్స్ చేసేందుకు మూవీ టీమ్‍కు మరో ఇబ్బంది ఎదురవుతోందనే సమాచారం బయటికి వచ్చింది.

yearly horoscope entry point

ఓటీటీ డీల్ జరగకపోవటంతో..

విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే, రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ బరిలో ఉండటంతో చిరూ చిత్రం పోటీ నుంచి తప్పుకుందని సమాచారం. అయితే, విశ్వంభర కోసం మే 9వ తేదీన మేకర్స్ పరిశీలిస్తున్నారనే సమాచారం ఇటీవల బయటికి వచ్చింది. రాజాసాబ్ రాకపోతే ఏప్రిల్ 10వ తేదీకి కూడా రావొచ్చనే అంచనాలు వచ్చాయి. అయితే, ఈ మూవీకి రిలీజ్ డేట్‍ను ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. ఇందుకు ఓటీటీ డీల్ ఇంకా జరగకపోవడమే కారణం అని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో చాలా సినిమాల థియేట్రికల్ రిలీజ్‍లు ఓటీటీ డీల్‍ను బట్టే జరుగుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు భారీ మొత్తం ఇస్తుండటంతో వాటి ప్లాన్ ప్రకారం కొన్ని చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. విశ్వంభర విషయంలో ఇదే జరుగుతోంది. ఓటీటీ డీల్ ఇంకా జరగపోవటంతో థియేటర్లలో రిలీజ్ డేట్‍పై కూడా మేకర్స్ డైలమాలో ఉన్నారు.

చర్చలు జరుగుతున్నాయి

విశ్వంభర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థలతో ఈ మూవీ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒక ఓటీటీ హక్కులను తీసుకున్న తర్వాత థియేటర్లలో రిలీజ్ డేట్‍ను లాక్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లు 2025కు గాను ఇప్పటికే ఫుల్ ప్లాన్‍ను చేసిపెట్టుకున్నాయి. మరి విశ్వంభర చిత్రం ఏ ఓటీటీతో డీల్ చేసుకుంటుందో చూడాలి. ఓటీటీ లాక్ అయ్యాకే అధికారికంగా విడుదల తేదీని మేకర్స్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకం నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్ ఉండే ఈ చిత్రానికి బడ్జెట్ రూ.100కోట్లకుపైగానే అయిందని అంచనా. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటించారు. మూడు లోకాల మధ్య సాగే కథతో సోషియో ఫ్యాంటసీ మూవీగా విశ్వంభరను డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం