Chinni Serial Trp Rating: చిన్ని సీరియల్ ఫస్ట్ వీక్ టీఆర్‌పీ రేటింగ్ - ఏదో అనుకుంటే..?
Chinni Serial Trp Rating: జూలై 1 నుంచి స్టార్ మా ఛానల్‌లో ప్రారంభమైన చిన్ని సీరియల్ ఫస్ట్ వీక్ లో 7.70 టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్నది. అంచనాల కంటే తక్కువే టీఆర్‌పీ రేటింగ్ సాధించి డిసపాయింట్ చేసింది.
Chinni Serial Trp Rating: ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభమైన చిన్న సీరియల్ ఫస్ట్ వీక్‌లో మోస్తారు టీఆర్‌పీ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకున్నది. తెలుగు సీరియల్ లవర్స్‌ను ఈ తల్లీకూతుళ్లు సెంటిమెంట్ సీరియల్ అంతగా మెప్పించలేకపోయింది. జూలై 1 నుంచి చిన్ని సీరియల్ ప్రారంభమైంది.
చిన్ని సీరియల్ కోసం నువ్వు నేను ప్రేమ సీరియల్ టైమింగ్‌ను మార్చేశారు. రాత్రి ఏడు గంటలకు టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్‌ను మధ్యాహ్నం ఒంటి గంటకు షిఫ్ట్ చేశారు. టీఆర్‌పీ పరంగా ట్రెండింగ్‌లో ఉన్ననువ్వు నేను ప్రేమ స్థానంలో రాత్రి ఏడు గంటలకు చిన్ని సీరియల్‌ను టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు.
సక్సెస్ ఫార్ములాతో...
ఫస్ట్ వీక్‌లో ఈ సీరియల్‌కు పదికిపైనే టీఆర్‌పీ రేటింగ్ వస్తుందని మేకర్స్ అంచనా వేశారు. తల్లీకూతుళ్ల సెంటిమెంట్ అన్నది సీరియల్స్‌లో సక్సెస్ ఫార్ములా కావడంతో చిన్నికి అదే కలిసివస్తుందని అనుకున్నారు. తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న బ్రహ్మముడి, కార్తీక దీపం 2 సీరియల్స్ టీఆర్‌పీ పరంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. చిన్ని కూడా ఆ సీరియల్స్ సరసన నిలుస్తుందని అనుకున్నారు.
అర్బన్ రూరల్ ఏరియాల్లో...
కానీ అర్బన్ రూరల్ ఏరియాలో కలిసి7.70 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. అర్బన్ ఏరియాలో 6.72 టీఆర్‌పీ రేటింగ్‌ను మాత్రమే ఈ సీరియల్ సొంతం చేసుకున్నది. టీఆర్‌పీ రేటింగ్ పరంగా స్టార్ మా సీరియల్స్‌లో టాప్ ఫైవ్‌లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. సెకండ్ వీక్ నుంచి టీఆర్‌పీ రేటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్లు సీరియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కావ్యశ్రీ లీడ్ రోల్...
చిన్ని సీరియల్‌లో కావ్యశ్రీ, వీరేన్, రవికిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. ఈ సీరియల్‌కు విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
చిన్ని జైలులోనే పుడుతుంది. ఖైదీలు, జైలు అధికారులు తన ఆప్తులు అనుకుంటుంది. అలాంటి చిన్ని అనుకోకుండా తల్లి కావేరి దూరం కావాల్సివస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన చిన్నికి ఎవరు ఆశ్రయం కల్పించారు? బాలరాజు, సత్యంలతో చిన్నికి ఉన్న సంబంధం ఏమిటి? చిన్నిని కాంచన ఎందుకు ద్వేషిస్తోంది అనే అంశాలతో ఈ సీరియల్‌ను దర్శకుడు విజయ్ కృష్ణ రూపొందించారు.
బ్రహ్మముడి, కార్తీక దీపం 2...
ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ పరంగా బ్రహ్మముడి, కార్తీక దీపం 2 సీరియల్స్ టాప్‌లో ఉన్నాయి. వాటి తర్వాత నువ్వు నేను ప్రేమ, గుండెనిండా గుడి గంటలుతో పాటు మరికొన్ని సీరియల్స్ కొనసాగుతోన్నాయి.