చిన్నారి పెళ్లి కూతురు (ఒరిజినల్ బాలికా వధు) సీరియల్ లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ ఎంగేజ్డ్! బుధవారం (జూన్ 11) తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవికా, మిలింద్ గత 5 సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమె తన ప్రియుడిని నవంబర్ 2020లో ప్రజలకు పరిచయం చేసింది.
ఉయ్యలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన అవికా గోర్.. తన లవర్ మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకోబోతోంది. వీళ్ల నిశ్చితార్థం వేడుకు ఘనంగా జరిగింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది అవికా.
“అతను అడిగాడు.. నేను నవ్వాను, ఏడ్చాను (ఆ క్రమంలో 🙈) నా జీవితంలో అత్యంత ఈజీగా యస్ అని గట్టిగా అరిచా. నేను పూర్తిగా ఫిల్మీ అమ్మాయిని - బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో-మో డ్రీమ్స్, మస్కారాతో ఉంటా. అతను లాజిక్, ప్రశాంతంగా ఉంటాడు. ‘ఏమైనా అయితే ఎలా జాగ్రత్తగా ఉండటానికి ఫస్ట్-ఎయిడ్ కిట్ తీసుకువెళదాం’ అని చెప్పే రకం అతను’’ అంటూ రాసుకొచ్చింది అవికా.
‘‘నేను డ్రామాను కోరుకుంటా. అతను దాన్ని మ్యానేజ్ చేస్తాడు. ఏదో విధంగా మేం ఫిట్ అయ్యాం. కాబట్టి అతను ప్రపోజ్ చేసినప్పుడు.. నాలోని హీరోయిన్ బయటకు వచ్చింది. చేతులు గాలిలో, కళ్ళలో నీళ్ళు, మెదడులో జీరో నెట్‌వర్క్. ఎందుకంటే ఇదే నిజమైన ప్రేమ? ఇది ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ ఇది మ్యాజికల్’’ అని ఇన్ స్టాలో అవికా పోస్టు చేసింది.
అవికా గోర్ ఎంగేజ్ మెంట్ చేసుకున్న మిలింద్ చంద్వానీ ఐఐఎం గ్రాడ్యుయేట్. అతనిది కార్పోరేట్ ప్రపంచం. అవికాది ఏమో ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్. కానీ వీళ్ల మనసులు కలిశాయి. 2020 నుంచి వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. మిలింద్ క్యాంప్ డైరీస్ అనే ఎన్జీవోను నడుపుతున్నాడు. గతంతో ఎంటీవీ రోడీస్ రియల్ హీరోస్ అనే అడ్వెంచర్ రియాలిటీ షోలో పాల్గొన్నాడు.
వాళ్ల సంబంధం గురించి అవికా గతంలో మాట్లాడుతూ.. “అతను 9-5 కార్పొరేట్ ఉద్యోగి. అతను ఒక ఎన్జీవో కూడా నడుపుతున్నాడు. అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. మేము హైదరాబాద్‌లో ఒక స్నేహితుడి ద్వారా కలుసుకున్నాము. అతను మొదట నన్ను ఆరు నెలల పాటు ఫ్రెండ్ జోన్‌లో ఉంచాడు. నాకు మొదటి రోజు నుండి అతను నచ్చాడు’’ అని తెలిపింది.
‘‘నా చేతుల్లో ఉంటే నేను నాలుగన్నర సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకునేదాన్ని. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో అదే. నా మనస్సులో పెళ్లి అయిపోయింది. కానీ అతను చాలా తెలివైనవాడు. అతను నాతో, ‘నువ్వు ఇంకా 26 ఏళ్ల అమ్మాయివి, నేను 32 ఏళ్ల వ్యక్తిని. నువ్వు పనిచేయడానికి, జీవితాన్ని చూడటానికి సమయం తీసుకో’ అని చెప్పాడు” అని అవికా గోర్ పేర్కొంది.
బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు), ససురల్ సిమర్ కా వంటి సీరియల్స్ తో అవికా ఫేమస్ అయింది. తెలుగులో ఉయ్యలా జంపాలా, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 తదితర సినిమాలు చేసింది.
సంబంధిత కథనం