నేషనల్ అవార్డులను గెలుచుకున్న బెస్ట్ చిల్డ్రన్ మూవీస్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించిన చిల్లార్ పార్టీ మూవీ 2011లో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది. కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. చిల్లార్ పార్టీ పేరుతో కొందరు చిన్నారులు ఓ గ్రూప్ ఏర్పాటుచేస్తారు. వారు చేసే చిలిపి పనులు, అల్లరి, ఆటపాటలతో ఫన్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది.
వరల్డ్ యంగెస్ట్ మారథాన్ రన్నర్ బుధియా సింగ్ జీవితం ఆధారంగా రూపొందినబుధియా సింగ్ బోర్న్ టూ రన్నర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీలో మనోజ్ బాజ్‌పేయి, తిలోత్తమా షోమే, శృతి మరాటే కీలక పాత్రల్లో నటించారు. ఐదేళ్ల వయసున్న ఓ బాలుడు మారథాన్ పోటీల్లో ఎలా విజేతగా నిలిచాడు? శిక్షణలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యానే అంశాలతో ఈ మూవీ రూపుదిద్దుకున్నది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నిర్మించిన సిక్కిం లాంగ్వేజ్ మూవీ పహునా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్ట్రీనింగ్ కావడమే కాకుండా అవార్డులను గెలచుకుంది. ఈ మూవీలో అనుమోల్ లింగో, ఇషికా, మంజు ఛెత్రి ప్రధాన పాత్రలు పోషించారు. టెర్రరిస్ట్‌ల ఎటాక్ నుంచి తప్పించుకునే క్రమంలో ముగ్గురు చిన్నారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తిరిగి తమ తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నారనే పాయింట్‌తో డ్రామా థ్రిల్లర్‌గా పహునా మూవీని దర్శకుడు తెరకెక్కించారు.
బ్లూ అంబ్రెల్లా మూవీ 2007 నేషనల్ అవార్డులలో బెస్ట్ చిల్డ్రన్స్ మూవీగా నిలిచింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పంకజ్ కపూర్ శ్రేయా శర్మ లీడ్ రోల్స్‌లో నటించారు. బ్లూ కలర్ అంబ్రెల్లాతో ఓ చిన్నారి అనుబంధంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ అంబ్రెల్లా దొంగతానికి గురువుతుంది? దానిని తిరిగి దక్కించుకోవడానికి ఆ చిన్నారి ఏం చేసింది అన్నదే ఈ మూవీ కథ.
హిందీ చిల్డ్రన్స్ మూవీ ఐ యామ్ కలమ్ కేన్స్, ఇఫీతో పాటు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులను సొంతం చేసుకున్నది. రోడ్డు పక్కన చిన్న దాబాలో పనిచేసే ఓ చిన్నారి...అబ్దుల్ కలామ్‌ను స్ఫూర్తిగా ఆయనలా సైంటిస్ట్‌గా మారాలని కలలు కంటాడు. తన కలలను సాకారం చేసుకునే క్రమంలో ఆ చిన్నారి సాగించిన జర్నీతో ఐయామ్ కలామ్ మూవీని దర్శకుడు నీలా పాండా తెరకెక్కించారు. ఈ సినిమాకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా హర్ష్ మయార్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నది.
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఆమిర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన బాలీవుడ్ మూవీ తారే జమీన్ పర్ ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. మూడు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నది. 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన వంద కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం